శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మే 2020 (10:52 IST)

లూసిఫర్ రీమేక్‌లో త్రిష.. మళ్లీ మెగాస్టార్ సరసన చెన్నై చంద్రం..

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ త్రిష మరో సినిమాలో చిరు సరసన నటించే అవకాశం త్రిషకి దక్కిందని టాక్. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ లూసిఫర్ రీమేక్‌ని నిర్మిస్తానని ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన తరుణంలో.. ఇందులో హీరోయిన్‌గా త్రిషను తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవొద్దని త్రిష కూడా అనుకుంటుందట. 
 
స్టాలిన్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఆచార్యలో నటించే ఛాన్సును త్రిష సొంతం చేసుకుంది. అయితే ఆ ఛాన్సును త్రిష సున్నితంగా తిరస్కరించింది. అందుకు కారణం ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అయితే ఆచార్య మిస్ అయినా మరో సినిమాలో చిరు సరసన నటించే అవకాశం త్రిషను వెతుక్కుంటూ వస్తోందని టాక్.