గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (14:31 IST)

టాలీవుడ్ నటుడు చలపతి చౌదరి ఇకలేరు..

chalapathi chodary
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చలపతి చౌదరి ఇకలేరు. ఆయన శుక్రవారం కర్నాటకలో కన్నుమూశారు. ఆయన వయసు 67 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన కర్నాటకలోని రాయచూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
ఏపీలోని విజయవాడకు చెదిన చలపతి రాయచూరులో స్థిరపడ్డారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, శివరాజ్ కుమార్ వంటి హీరోల చిత్రాల్లో నటించారు. 
 
ఇటీవల బాలయ్య నటించిన "అఖండ" చిత్రంలో కూడా ఆయన ఓ పాత్రను పోషించారు. అలాగే, పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆయన మృతి వార్త తెలిసిన అనేక సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.