గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (14:43 IST)

త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో రమ్యకృష్ణ.. రేణుకా చౌదరిగా శివగామి..?

అత్తారింటికి దారేది చిత్రంలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్భూకు కీలక పాత్రలిచ్చిన త్రివిక్రమ్.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిస్తున్న సినిమాలో రమ్యకృష్ణకు ఛాన్సిచ్చినట్లు తెలుస్తోంది. తాజా

అత్తారింటికి దారేది చిత్రంలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్భూకు కీలక పాత్రలిచ్చిన త్రివిక్రమ్.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిస్తున్న సినిమాలో రమ్యకృష్ణకు ఛాన్సిచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లోని సినిమా తొలి షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుతోంది. 
 
ఈ సినిమాలో కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తమిళంలో సూర్య మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన రమ్యకృష్ణ, ప్రస్తుతం ''శైలజా రెడ్డి అల్లుడు''లో పవర్ఫుల్ రోల్ చేస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో రమ్యకృష్ణ ఎంపిక ఖరారైతే.. కచ్చితంగా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని సమాచారం. 
 
మరోవైపు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తన తండ్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై నందమూరి హీరో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో రేణుకా చౌదరి పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లు సమాచారం. రేణుక చౌదరికి ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేక అనుభంధం ఉంది. ఆయన దత్తపుత్రికగా కీలక పాత్ర పోషించారు.