సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (13:50 IST)

రాజుగారి గది 3 ట్రైలర్.. అదిరిందిగా.. (Video)

ఓంకార్ రాజుగారి గది 3 ట్రైలర్ అవుట్ అయ్యింది. యాంకర్‌ నుంచి దర్శకుడిగా మారిన ఓంకార్.. జీనియస్ సినిమాతో మంచి పేరు కొట్టేశాడు. కానీ కలెక్షన్ల పరంగా ఆ సినిమా రాణించలేదు. ఆపై హార్రర్ ఫార్మాట్‌ను ఎంచుకున్నాడు. 
 
ఈ క్రమంలో హార్రర్‌ ఫార్మెట్‌తో రాజుగారిగది అని సినిమా తీశాడు. అందులో తన తమ్ముడు అశ్విన్‌ ఓంకార్‌ను హీరోగా చూపిస్తూ, మిగిలిన పాడింగ్‌ ఆర్టిస్టులతో తను చేసిన ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. చిన్న సినిమాగా విడుదలై, మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 'రాజుగారి గది' ఓంకార్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిపోయింది. 
 
రాజుగారి గదికి సీక్వెల్‌గా  రాజుగారి గది తెరకెక్కింది. ఇందులో అక్కినేని నాగార్జున, ఆయన కోడలు సమంత నటించారు. ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాను ఓంకార్ తెరపైకి తీసుకొచ్చారు. రాజుగారి గది3 చిత్రంలో మొదట రెండు చిత్రాలలో పూర్ణ, సమంత నటించగా ఈ మూడవ చిత్రంలో అవికా గౌర్ నటించడం విశేషం.
 
కాగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఒకటిన్నర నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ హారర్ అంశాలతో ఆసక్తికరంగా సాగింది. ఈ ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.