వంద కోట్ల సినిమాలా కాన్ఫిడెంట్‌గా విడుదల కాబోతున్నఊరి పొలిమేర -2
Adavisesh, kamakshi and ohters
ఓ.టి.టి.లో విడుదలైన “మాఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం “మా ఊరి పొలిమేర 2”. డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి అడవి శేషు మాట్లాడుతూ “నా ఫస్ట్ సక్సెస్ క్షణంకు వర్క్ చేసిన టీమ్ అంతా ఈ టీమ్‌లో వున్నారు. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ నాకు మంచి స్నేహితుడు. అతని ప్రతిభ నాకు తెలుసు. ఈ రోజు అతను ఓ బ్లాక్‌బస్టర్ సినిమా తీసి దానికి సీక్వల్ తీయడం ఆనందంగా వుంది. ఇది నా సొంత సినిమా లాంటింది.ఈ చిత్రానికి ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ వర్క్ చేశారు. తప్పకుండా ఈ చిత్ర మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది* అన్నారు.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, సినిమాకు హిట్ కళ కనిపిస్తుంది. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏదైనా అదే కష్టమే. సినిమాను ఆదరించే ఆడియన్స్‌కు మంచి సినిమా కావాలి అంతే. కొత్త కంటెంట్‌ను ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారు. ఈ టీమ్ కష్టం కనిపిస్తుంది. సినిమాకు ఓ ఫ్రాంచైజీ క్రియేట్ చేయడం కష్టం. అలాంటి అరుదైన ఫీట్ ఈ సినిమాకు కుదిరింది అన్నారు.
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ, ఈ సినిమా విషయంలో నాకు హీరోయిన్ కామాక్షి గారి సహకారం మరువలేనిది. హీరోయిన్‌గానే కాకుండా దర్శకత్వ శాఖలో కూడా ఆమె ఎంతో డేడికేషన్‌తో పనిచేసింది. ఈ రోజు ఇంత గొప్పగా 100 కోట్ల సినిమాలా కాన్ఫిడెంట్‌గా విడుదల చేస్తున్నామంటే వంశీ నందిపాటి కారణం. ఈ సినిమాకు టెక్నిషియన్సే హీరోలు. ఈ చిన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత గౌరిక్రిష్ణ మాట్లాడుతూ,ఈ చిత్రం ఈ రోజు ఇంత గ్రాండ్‌గా విడుదల కావడానికి కారణం వంశీ నందిపాటి గారు. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. అన్నారు.
కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ ఈ సినిమాకు హీరోయిన్‌తో పాటు దర్వకత్వ శాఖలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు విశ్వనాథ్‌కు నా థ్యాంక్స్. ఈ సినిమా విడుదల తరువాత ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుంది* అన్నారు.