1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (17:43 IST)

ఆశిష్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తోన్నచిత్రంలో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya
వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలో రూపొందిన బలగం వంటి మూవీ ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను సాధించిందో అందరికీ తెలిసిందే.
 
 తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో ఆశిష్ హీరోగా  అరుణ్ భీమవరపు దర్శకత్వంలో సినిమాను తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుంటే, నేషనల్ అవార్డ్ విన్నర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.