శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (18:33 IST)

గేమ్ ఛేంజర్ లో పాత్ర కోసం బాడీని తగ్గించుకున్న అంజలి, తాజా అప్ డేట్ !

Anjali
Anjali
పలు సినిమాలలో హీరోయిన్ గా, కీలక పాత్రలు పోషించిన నటి అంజలి గేమ్ ఛేంజర్ లో సరికొత్తగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం తన బాడీని కూడా తగ్గించుకుంది. రామ్ చరణ్  తాజా సినిమా గేమ్ ఛేంజర్ లో అంజలి పాత్ర హైలైట్ గా వుండబోతోంది అని తెలియవచ్చింది. దర్శకుడు శంకర్ ఈ సినిమాను పాన్ ఇండియా గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు నలుగురు మెగా నిర్మాతలు నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవలే మైసూర్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో అంజలి పాత్ర చాలా కీలకంగా మారనుంది.
 
అదెలాగంటే, బాహుబలి సినిమాలో అనుష్క పాత్రను పోలి వుంటుందట. ఇందులో ఆమె మొదట రామ్ చరణ్ పాత్రకు భార్యగా నటిస్తుంది. పెద్ద రామ్ చరణ్ చనిపోవడంతో ఆయన కుమారుడుగా నటిస్తున్న రెండో రామ్ చరణ్ కు తల్లిగా వుండే అంజలి తన భర్తను చంపిన వారిపై పగతీర్చుకునే విధంగా మోటివేట్ చేస్తుందని తెలిసింది. అంజలి పాత్ర తెల్లటి జుట్టుతో ముసలితనం ఉట్టి పడే విధంగా వున్న గెటప్ తో ఇటీవలే ఆమెపై కొన్ని సన్నివేశాలు తీసినట్లు సమాచారం.