గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (20:03 IST)

"వీరసింహా రెడ్డి" నుంచి అప్‌డేట్.. 25న పస్ట్ సింగిల్

veera simha reddy
హీరో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం 'వీరసింహా రెడ్డి'. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇది బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రం. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని పాటల్లో తొలి పాటను ఈ నెల 25వ తేదీన ఉదయం 10.29 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. 
 
"రాజసం నా ఇంటి పేరు'' అంటూ ఫస్ట్ సింగిల్ కొనసాగనుంది. ఇందులో విలన్‌గా దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది.