మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (10:28 IST)

వీరసింహారెడ్డి కొత్త షెడ్యూల్ ఖరారైంది

VeeraSimhaReddy
VeeraSimhaReddy
క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణతన 107వ చిత్రాన్ని చేస్తున్నారు . గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ వచ్చింది. నేడు గ్రహణం. కనుక ఈరోజు షూటింగ్ రెస్ట్ తీసుకుని. రేపటినుంచి షూటింగ్ జరపనున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. వీరసింహారెడ్డి షూటింగ్ అనంతపురం జిల్లాలో జరగనుంది
 
అనంతపురం జిల్లాలో నవంబర్ 9 - పెన్నోబిలం లక్ష్మీ నటసింహ స్వామి ఆలయం,  నవంబర్ 10, నవంబర్ 11: అమిధ్యాల, రాకెట్ల, ఉరవకొండ, నవంబర్ 12 & నవంబర్ 13: పెనుగొండ కోటలో జరగనున్నది యూనిట్ తెలిపింది. ఈ షెడ్యూల్లో రామ్ లక్ష్మణ్ ఆధర్వ్యంలో   పోరాట సన్నివేశాలు,  కీలక సన్నివేశాలు చిత్రించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. రోడ్ పై పరుగెత్తే సన్నివేశాల కోసం పోలీస్ పర్మిషన్ పొందినట్లు తెలిసింది. 
 
మైత్రి మూవీ మేకర్స్  బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు.