గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (17:35 IST)

అర్జున్ రెడ్డి కొత్త సీన్లతో వచ్చేస్తున్నాడు.. 2022 ఆగస్టు 25న మళ్లీ రిలీజ్

విజయ్ దేవరకొండ ఫ్యాన్సుకు శుభవార్త. సరిగ్గా మూడేళ్ళ క్రితం రిలీజ్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో నటుడు విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

అయితే ఈ సినిమా మళ్ళీ ఒకసారి రిలీజ్ అవుతుందని దర్శకుడు సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వెర్షన్‌లో అర్జున్ రెడ్డి బాల్యం, అతని బుల్లెట్ బైకుకు సంబంధించిన సన్నివేశాలు, అర్జున్ రెడ్డి పెంచుకున్న కుక్కతో వుండే సీన్లు, అర్జున్ రెడ్డి స్కూల్ ఫ్రెండ్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని వెల్లడించారు. 
 
'ఈ సినిమా మొత్తం నిడివి 4 గంటల 20 నిమిషాల వచ్చింది. నిడివి ఎక్కువ కావడంతో, ఎడిటింగులో కొన్ని సన్నివేశాలను కట్ చేసి, చివరికి 3 గంటల 45 నిమిషాలకు కుదించామని చెప్పారు. కానీ, ఇంత నిడివి ఉన్న సినిమాను రోజు నాలుగు ఆటలు వేయలేమని థియేటర్ ఓనర్లు తెలిపారు. 
 
దీంతో ఈ సినిమాను మరింత కుదించి 3 గంటల 6 నిమిషాల నిడివితో విడుదల చేశాం. 3 గంటల 45 నిమిషాల రన్ టైంతో ఈ సినిమాను విడుదల చేసుంటే మరింత హిట్టయ్యేదని మేం అనుకుంటున్నాం. అందుకే, ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2022 ఆగస్టు 25న 3 గంటల 45 నిమిషాల 'అర్జున్ రెడ్డి' సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం." అని సందీప్ రెడ్డి వంగ తెలిపారు.  ప్రస్తుతం కట్ చేసిన సీన్లతో అర్జున్ రెడ్డిని విడుదల చేస్తామని చెప్పారు.