గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (14:02 IST)

లవ్ లైఫ్ గురించి చెప్పను.. వారిని బాధపెట్టను.. విజయ్ దేవరకొండ

Vijaydevarakonda
Vijaydevarakonda
కాఫీ విత్ కరణ్ సీజన్ 7 యొక్క నాల్గవ ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ-అనన్య పాండే కనిపించనున్నారు. దీనిని జూలై 28న రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా Disney+ Hotstarలో ప్రసారం చేస్తున్నారు. 
 
డిస్నీ+ హాట్‌స్టార్ అందించే కాఫీ విత్ కరణ్ సీజన్ 7 రచ్చ రచ్చగా వుండనుంది. ఎందుకంటే రౌడీ హీరో పాలుపంచుకునే ఈ ఎపిసోడ్‌ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బి-టౌన్ లేడీస్‌లో అత్యంత ట్రెండింగ్ క్రష్ అయిన విజయ్ దేవరకొండ లైగర్ నటి అనన్య పాండేతో కలిసి ఈ షోలో కనిపించనున్నాడు. షో ఐకానిక్ హోస్ట్, కరణ్ జోహార్ ఈ షోలో వారి నుంచి ఆసక్తికరమైన విషయాలను రాబట్టే అవకాశం వుంది.  
 
తన ప్రేమ జీవితం విషయానికి వస్తే తక్కువ ప్రొఫైల్‌ను ఉంచడంతో పాటు తన రిలేషన్ షిప్ స్టేటస్‌ను ఎందుకు బహిరంగంగా వెల్లడించలేదో పంచుకున్నాడు. 
 
"నేను పెళ్లి చేసుకొని పిల్లలను కనే రోజు ఏవిషయాన్నైనా గట్టిగా చెబుతాను. అప్పటి వరకు నన్ను ఆరాధించే వారిని బాధపెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఒక నటుడిగా నన్ను ప్రేమించే వారు చాలా మంది ఉన్నారు. వారి హృదయాన్ని విచ్ఛిన్నం చేయకూడదనుకుంటున్నాను" అని విజయ్ దేవరకొండ చెప్పాడు. 
 
అంతేగాకుండా మీరు రిలేషన్‌లో ఉన్నారా అని కరణ్ జోహార్ అడిగినప్పుడు ధృవీకరించడానికి రౌడీ హీరో ఇష్టపడలేదు. అలా తన వ్యక్తిగత విషయాలను విజయ్ బహిరంగం చేసేందుకు ఇష్టపడలేదు.