శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (11:19 IST)

మెగా ఫ్యామిలీ వారసుడి మొదటి సినిమాకి విలన్‌గా స్టార్ హీరో..

వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ, తన అద్భుతమైన ఫెర్ఫామెన్స్‌తో దూసుకుపోతున్న దక్షిణాది హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ప్రస్తుతం అనేక క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఆఫర్లు చేజిక్కించుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ తమిళ నటుడు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రజలకు కూడా సుపరిచితుడయ్యాడు. 



ఇక టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి "సైరా" సినిమాతో తెలుగు ప్రజలను నేరుగా పలకరించనున్నాడు. ఈయన గురించి ఓ వార్త టాలీవుడ్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది.
 
మెగా ఫ్యామిలీ నుండి మరో వారసుడు వెండితెరకు పరిచయమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బుచ్చిబాబు సాన తన సినిమాలో విలన్ పాత్ర కోసం తాజాగా విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

మెగా హీరోను లాంచ్ చేస్తున్న తొలి చిత్రంపై అంచనాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారట సినిమా యూనిట్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నటించడానికి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, అయితే డేట్స్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నట్లు సినీవర్గాలలో చర్చ జరుగుతోంది. మొత్తానికి టాలీవుడ్‌లో విజయ్ సేతుపతి హవా నడుస్తోంది మరి.