బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (19:41 IST)

సామాన్యుడు నుంచి ట్రైలర్ వచ్చేసింది.. వీడియో చూడండి..

సామాన్యుడు నుంచి ట్రైలర్ వచ్చేసింది. శరవణన్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘సామాన్యుడు.. నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 
 
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.  "నీకో మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా అంటూ విశాల్ వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నేను ఒక సామాన్యుడిని.. ఎదురుతిరగకపోతే నన్ను కూడా చంపేస్తారు.."అని విశాల్ చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. 
 
ట్రైలర్ మొత్తం విశాల్ యాక్షన్‌తో నింపేశారు. ఇక డింపుల్ హయతి‌తో విశాల్ రొమాన్స్ కొద్దిగా హద్దు దాటి చూపించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించడమే కాక అంచనాలను కూడా పెంచేసింది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.