శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (18:57 IST)

రేపు లైవ్ ప్రోగ్రామ్ గా ఎస్పీ బాలుకు స్వర నీరాజనం

Jeevita, N.Sankar, etc,
రేపు అన‌గా జూన్ 4, ఎస్పీ బాలు 75వ జయంతి, ఈ సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు నిశాళుల‌ర‌ప్పిస్తుంది. జూన్ 4న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ''ఎస్పీ బాలుకు స్వరనీరాజనం'' కార్యక్రమం 'ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్' యూట్యూబ్ ఛానల్, 'సంతోషం సురేష్' యూట్యూబ్ చానెల్స్ లో 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ ఏక‌ధాటిగా ప్రసారం కానుంది.
 
ఈ విషయం గురించి  సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ, ఈ ట్రిబ్యూట్ ఇస్తున్న వారంతా బాలూ గారితో ఉన్న అనుబంధాలను కూడా పంచుకుంటారు. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరం కలిసి చేస్తున్నాం. తప్పకుండా చూసి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అన్నారు.  
 
తెలుగు ఫిల్మ్  ఛాంబర్ సెక్రటరీ  నిర్మాత కెఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ,  సినిమా నిర్మాతలు, దర్శకులు, హీరోలు, అందరు పాలు పంచుకుంటార‌ని అన్నారు.
 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ నటి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, బాలుగారు చనిపోయిన తరువాత అప్పుడున్న పాండమిక్ సిట్యుయేషన్ లో ఎలా రెస్పాండ్ కావాలో తెలియని పరిస్థితి. అప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. బాలుగారి గురించి చాలా మంది సినిమా పరిశ్రమలో చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది.  అయన గురించి చాలా చెప్పుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అందె్ఉ ఈ కార్యక్రమంలో సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా అందరు కలిసి చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసారు, ఈ కార్యక్రమంలో సినిమాకు సంబందించిన అందరిని ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.
 
డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ మాట్లాతుడు, సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్స్, రచయితలూ ఇలా అందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మీకు నచ్చే పాటలు ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి బాలూ గారిని గుర్తుచేసుకుని అవకాశం ఇది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూసి విజయవంతం చేయండి అన్నారు.
 
నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, బాలు గారు నిర్మాతగా విశ్వనాధ్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ తో `శుభ సంకల్పం` నిర్మించారు. ఒక గాయకుడిగానే కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా భారదేశంలో ఉన్న అన్ని భాషల్లో పాటలు పాడిన గొప్ప సింగర్ అయన. ఏ భాషలో పాట పడిన ఆయనకే సాటి. అలాగే బ్రీత్ లెస్ సాంగ్ పాడి అందరికి షాక్ ఇచ్చాడు.ఎస్పీ బాలుగారిని తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. ఈ కార్యక్రమం  జూమ్ మీటింగ్ లో అటెండ్ అయి బాలు తో ఉన్న అనుబంధాన్ని సినిమా రంగానికి చెందిన అందరు పాల్గొంటారని తెలిపారు.