మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (12:36 IST)

ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా అది.. చిరంజీవి

కింగ్ నాగార్జున, సయామి ఖేర్, దియా మీర్జా, రాహుల్ సింగ్ తదితరులు కలిసి నటించిన తాజా చిత్రం "వైల్డ్ డాగ్". అహిషూర్ సల్మాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. 
 
ప్ర‌తి ఒక్క‌రు చూడాల్సిన సినిమా ఇద‌ని చెప్పారు. 'ఇప్పుడే వైల్డ్‌డాగ్ చూశాను. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ల‌కి కట్టినట్టుగా చూపించారు' అని చిరంజీవి పేర్కొన్నారు.
 
'ఆ ఆవేశాన్ని, ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించిన నా సోదరుడు నాగార్జునని, వైల్డ్ డాగ్ టీంని, దర్శకుడు సోలోమాన్, నిర్మాత నిరంజ‌న్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 
 
ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు.. ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడాల్సిన చిత్రం. డోంట్ మిస్ దిస్ వైల్డ్ డాగ్‌!  వాచ్ ఇట్!!' అని చిరంజీవి ట్వీట్ చేశారు.