1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 1 జులై 2023 (17:45 IST)

డాక్టర్ ఎమ్ ప్రభాకర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం: వల్లభనేని అనిల్ కుమార్

anil, laxmi and others
anil, laxmi and others
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దివంగత నటుడు డాక్టర్ ఎమ్ ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని చిత్రపురి కాలనీలో అంగరంగవైభవంగా శనివారం ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు సాక్షిగా ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యి సంతాపం తెలిపారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపురి కాలనీ లో అవిశిష్కరించారు.
 
Anil comity with Prabhakar reddy family
Anil comity with Prabhakar reddy family
సినీ పరిశ్రమ కోసం ఎంతగానో కృషి చేసిన ప్రభాకర్ రెడ్డికి చిత్రపురి కాలనీ వాసులు అంత రుణపడి ఉన్నామని తెలిపారు.సినీ పరిశ్రమకు చేసిన త్యాగాలను గుర్తుచేశారు.
 
వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రభాకర్ రెడ్డి గారి కృషి వల్లే చిత్రపురి లోని కార్మికులు ఇండ్లు వచ్చాయి. వారి కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు. లక్ష్మి గారి సపోర్ట్ ఎంతో ఉంది. అందరికి ఇండ్లు వచ్చాకే విగ్రహం పెట్టాలని కుటుంబ సభ్యులు కోరిక మేరకు ఈనాడు  ఏర్పాటు చేసాం. ఈరోజు నిజమైన పండుగ. ఆయన రాత్రి, పగలు కస్టపడి కార్మికులు కోసం తపించారు. అప్పటి ముఖ్యమంత్రులను కలిశారు. అయన కృషివల్లే కాలనీ వచ్చింది. అందుకే ప్రస్తుతం ఉన్న మా కమిటీ ఎమ్ ప్రభాకర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు.