శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:37 IST)

బాహుబలి రికార్డులను చెరిపేసిన స్టార్ హీరో... ఎక్కడో తెలుసా?

రాజమౌళి చెక్కిన బాహుబలి 2 ప్రతి భాషలోనూ రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా దక్షిణాది భాషల్లో ఈ సినిమా సృష్టించిన ఓ రేంజ్‌లో అలజడి సృష్టించి, భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. దక్షిణాదిలో చిన్న రాష్ట్రమైన కేరళలో అయితే బాహుబలి 2 సినిమా కేవలం ఏడు రోజుల్లో 30 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది. కేరళలో ఇప్పటి వరకు ఇవే రికార్డ్ కలెక్షన్లు.
 
ఈ రికార్డును మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ బ్రేక్ చేసాడు. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా కేవలం ఆరో రోజుల్లోనే 30 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసి బాహుబలి రికార్డును అధిగమించింది.
 
ఈ సినిమాకు మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ దర్శకత్వం వహించగా వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్‌లు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో 78 కోట్ల రూపాయలు వసూలు చేసి వందకోట్ల మార్కును చేరుకునేందుకు చాలా దగ్గరలో ఉంది.