బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (10:01 IST)

లోదుస్తులు చూపించమని కోరితే ఆ హీరోయిన్ అంగీకరించలేదు : టినూ ఆనంద్

madhuri dexith
ఒక సన్నివేశం చిత్రీకరణలో భాగంగా లోదుస్తులు చూపించమని కోరితో హీరోయిన్ మాధూరీ దీక్షిత్ నిరాకరించారని బాలీవుడ్ నటు టినూ ఆనంద్ వెల్లడించారు. దీంతో తనకు ఆమెకు తీవ్ర స్థాయిలో గొడవ జరిగిందని, దీంతో షూటింగ్ నుంచి వెళ్ళి పోవాలని గట్టిగా అరవడంతో ఆమె బ్యాగు తీసుకుని వెళ్లిపోయిందని ఆయన వెల్లడించారు.
 
తాజాగా టినూ ఆనంద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ, 'బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్, నటి మాధురి దీక్షిత్ జంటగా 1989లో 'షనక్త్' అనే చిత్రాన్ని పట్టాలెక్కించా. వాళ్లిద్దరి కాంబోలో అదే తొలి చిత్రం. దాంతో అందరికీ ఆ సినిమాపై ఆసక్తి ఉండేది. 
 
సినిమాలోని ఓ సీక్వెన్స్‌లో అమితాబ్ బచ్చను కొంతమంది రౌడీలు బందిస్తారు. రౌడీల నుంచి హీరోయిన్ను కాపాడేందుకు ఆయన ఎంతో శ్రమిస్తారు. ఈ క్రమంలోనే తనని రక్షించిన హీరోకి కృతజ్ఞత తెలుపుతూ ఆయనతో అన్నివిధాలుగా దగ్గరవ్వాలని హీరోయిన్ అనుకుంటుంది. సినిమాలోని కీలకమైన ఈ సన్నివేశాల్లో హీరోయిన్ను లోదుస్తులతో చూపించాలనుకున్నా. 
 
అదే విషయాన్ని మాధురి దీక్షిత్‌కు చెప్పాను. ఆమె మొదట ఓకే అన్నారు. తీరా, షూట్ రోజు లోదుస్తులతో యాక్ట్ చేయడానికి ఓకే చేయలేదు. దాంతో ఆమెకు నాకు గొడవ జరిగింది. ఆ సీన్ చేయకపోతే సెట్ నుంచి వెళ్లిపొమ్మన్నా. ఆ మాటకు ఆమె బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది' అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.