గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (16:56 IST)

ఆ హీరోయిన్‌ను చూసి అసూయపడుతున్న కోలీవుడ్ హీరో...!!

dushara vijayan
హీరో దుషారా విజయన్‌ను చూసి కోలీవుడ్ హీరో ధనుష్ అసూయపడుతున్నారు. ఈ విషయాన్ని దుషారా విజయన్ స్వయంగా వెల్లడించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం "వేట్టయన్". వచ్చేనెల 10వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, దుషారా విజయన్ ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 
 
"రాయన్', 'వేట్టయన్' సినిమా షూటింగ్స్ ఒకే సమయంలో జరిగాయి. నేను రజనీకాంత్ మూవీ (వేట్టయన్)లో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ధనుష్ ఆనందించారు. ఓసారి నా వద్దకు వచ్చి... 'రజనీకాంత్ సర్‌తో కలిసి యాక్ట్ చేశావా?' అని అడిగారు. అవునని చెప్పా. ఆయన వెంటనే ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా. ఎందుకంటే ఆయనతో నేనింకా స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయా అని చెప్పారు. రజనీకాంత్‌ను ఆయన ఎంతలా ఇష్టపడతారో ఆ రోజు నాకు బాగా అర్థమైంది' అని దుషారా విజయన్ వెల్లడించారు. 
 
రజనీకాంత్‌పై తనకు ఉన్న అభిమానాన్ని ధనుష్ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలియజేశారు. చిన్నతనం నుంచే ఆయన్ని ఆరాధిస్తున్నానని చెప్పారు. ఆయన ఇల్లు చూడటం కోసమే పోయస్ గార్డెన్‌‍కు వెళ్లేవాడినని ఇటీవల 'రాయన్' ఈవెంట్‌‍లో తెలియజేశారు. 'జై భీమ్' విజయం తర్వాత టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. యాక్షన్ డ్రామా మూవీగా ఇది సిద్ధమైంది. ఇందులో రజనీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా కనిపించనున్నారు.