ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (18:34 IST)

ఎన్ కౌంటర్ అంటే మనిషిని హత్యచేయడమేనా? వేట్టైయాన్ ప్రివ్యూలో అమితాబ్ ప్రశ్న

Vettaiyan preview poster
Vettaiyan preview poster
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌ ఎస్.పి.గా ఓ ఊరికి వస్తాడు రజనీకాంత్. ఆయనంటే హడల్. సముద్ర తీరం ఓడల్లో సంఘవ్యతిరేక కార్యక్రమాలు చేసే వారిని హంటర్ గా కాల్చి చంపుతాడు రజనీకాంత్. కానీ పై అధికారిగా అమితాబ్ టీమ్ తో సమావేశమయి ఎన్ కౌంటర్ అంటే మనిషిని హత్యచేయడమేనా?  అని అమితాబ్ ప్రశ్నిస్తాడు. సమాధాన తెలియాలంటే సినిమా వచ్చేదాక ఆగాల్సిందే.  ఈరోజు విడుదలైన ప్రివ్యూ పేరుతో వీడియో విడుదల చేశారు. 
 
సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’.టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మించారు.  ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ వీడియోను విడుద‌ల చేసింది. ఇంత‌కీ ఈ ప్రివ్యూ వీడియోలో ఏముంద‌నే వివ‌రాల్లోకి వెళితే.. 
 
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని టాప్ మోస్ట్ సీనియ‌ర్ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌ల ఫొటోలు చూపిస్తూ.. ఈ ఆఫీస‌ర్స్ ఎవ‌రో మీకు తెలుసా! అని స‌త్య‌దేవ్ (అమితాబ్ బ‌చ్చ‌న్‌) అడుగుతారు. వీళ్లు పేరు మోసిన ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ అని ట్రైనింగ్‌లోని ఓ ఆఫీస‌ర్ స‌మాధానం చెబుతారు. ‘ఈ దేశంలో ల‌క్ష‌లాది మంది పోలీసులున్నారు.. కానీ వీళ్ల‌ని మాత్రం చూడ‌గానే గుర్తుప‌డుతున్నారంటే!.. అదెలా సాధ్యం’ అని మ‌ళ్లీ ప్ర‌శ్న‌వేయ‌గా.. ట్రైనింగ్ తీసుకుంటోన్న మ‌రో లేడీ ఆఫీస‌ర్ ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ని భ‌య‌ప‌డ‌కుండా ఎన్‌కౌంట‌ర్స్ చేయ‌టం వ‌ల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ అని స‌మాధానం చెబుతుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో మ‌న క‌థానాయ‌కుడు వేట్ట‌య‌న్ (ర‌జినీకాంత్‌) త‌న డ్యూటీలో ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఎన్‌కౌంట‌ర్స్ ఎలా చేశార‌నే స‌న్నివేశాల‌ను చూపిస్తూ వ‌చ్చారు. 
 
‘మ‌న‌కు ఎస్‌.పి అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అని నేరస్థులు రజినీకాంత్ అంటే భయపడుతుంటారు. విల‌న్స్ వేట్ట‌య‌న్ పేరు చెబితేనే హ‌డ‌లిపోతుంటారు. డీల్ చేయ‌టానికి భ‌య‌ప‌డుతుంటారు. 
 
రౌడీయిజం పేరు చెప్పి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న వారిని వేట్ట‌య‌న్ వేటాడుతుంటాడని ప్రివ్యూ స‌న్నివేశాల్లో చూపిస్తూ వ‌చ్చారు. ఇక ఫ‌హాద్ ఫాజిల్, దుసారా విజ‌య‌న్‌, ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన రానా ద‌గ్గుబాటి, అభిరామి, మంజు వారియ‌ర్‌ పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. అస‌లు వీళ్ల పాత్ర‌ల‌కు, వేట్ట‌య‌న్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న వేట్ట‌య‌న్ జీవితంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నార‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. 
 
ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది. 
 
ఈ చిత్రంలో రానా కూడా క్లాసిక్ పాత్ర పోషించాడు. ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్, అభిరామి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్‌కి రెడీ అవుతోంది.