శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (12:42 IST)

మంచు విష్ణు ఎంట్రీతో మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు సద్దుమణిగేనా

Manchu vishnu at airport
Manchu vishnu at airport
మంచు కుటుంబంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వివాదాలు పోలీస్ స్టేషన్  వరకు వెళ్ళాయి. అయితే ఈ వివాదం జరిగినప్పుడు మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు ఇండియాలో లేరు. ఆయన దుబాయ్ లో వున్నారు. తాజా సినిమా కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా వున్న విష్ణు నేడు హైదరాబాద్ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. అక్కడ మీడియా అంతా ఆయన్ను చుట్టుముట్టారు. ఆయనతో పాటు పర్సనల్ మేనేజర్ సారధికూడా ఆయనతోపాటు వున్నారు.
 
ఈ సందర్భంగా అక్కడివారు గొడవల గురించి ప్రస్తావించగా, తమ కుటుంబంలో ఇలాంటి గొడవలన్నీ కామన్ అని తేల్చేశారు. ఇదంతా ఫ్యామిలీ ఇష్యూ అన్నీ సాల్వ్ అవుతాయి అంటూ ముక్తసరిగా వెల్లడించారు. అలా మాట్లడుతూనే  ఆయన కారులో వెళ్ళిపోయారు.  మంచు మనోజ్ పై మోహన్ బాబు కేసు పెట్టడం, మనోజ్ గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు ఇవ్వడంతో దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు.. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. మరి మనోజ్ మాత్రం నాకు న్యాయం జరగడం లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నాకు న్యాయం జరిగేవరకూ అందరినీ కలుస్తా అని వెల్లడించారు. మంచి విష్ణు రాకతో ఈ వివాదం సద్దుమణుగుతుందా? లేదా? చూడాలి.