సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (10:32 IST)

ఫ్రెంచ్ గ‌ర్ల్ ఫ్రెండ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో అన్నివ‌ర్గాల‌ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. వేలంటెన్స్ డే సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.
 
ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను యూనిక్‌గా ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ భార్య పాత్ర‌లో న‌టిస్తోన్న ఐశ్వ‌ర్యా రాజేష్‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ భార్యగా స‌ర్‌ప్రైజింగ్ పాత్ర‌లో ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్నారు.

లేటెస్ట్‌గా శుక్ర‌వారంనాడు ఈ సినిమాలోని మ‌రో హీరోయిన్ ఇజాబెల్లె లెయితె లుక్‌ను విడుద‌ల చేశారు. ఇజా అనే పాత్ర‌లో న‌టిస్తోన్న ఇజా బెల్లె లెయితె ఫ్రాన్స్‌లో ఉంటుంది. ఫ్రాన్స్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏంట‌నేది తెలియ‌సేలా ఉంది. ఐశ్వ‌ర్య రాజేశ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్న పోస్ట‌ర్‌కు ఇది భిన్న‌మైన పోస్ట‌ర్‌.