ఓంకార్ శపథం గురించి విన్నారా..?
ఓంకార్ తెరకెక్కించిన తాజా చిత్రం రాజు గారి గది 3. ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓంకార్ తన స్పందనను తెలియచేస్తూ... ఈ సినిమా చిన్న పిల్లలతో సహా చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. ఈ సినిమా రెండు గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. థ్రిల్స్, చిల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. అతి తక్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చెయ్యడానికి కారణమైన ప్రతి టెక్నీషియన్, ఆర్టిసులకి ధన్యవాదాలు అన్నారు.
ఈ రోజు నేను ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి కారణం నా తమ్ముళ్లు అశ్విన్, కళ్యాణ్. ఇద్దరూ నన్ను నమ్ముకుని నాతో ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. నేను యాంకర్ అయినప్పటి నుండి అశ్విన్‌ని మంచి హీరోని చేయాలనీ, కళ్యాణ్‌ని ప్రొడ్యూసర్ చేయాలనీ అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ రెస్పాన్సిబిలిటీని నేను నెరవేర్చుకోబోతున్నాను.
మీరందరూ మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు. ఇక అసలు విషయానికి వస్తే... మాకు మీరున్నారన్న ధైర్యం ఉంది. ఏడాది క్రితం మా నాన్న గారు చనిపోయారు. అప్పటినుండి నేను వైట్ డ్రెస్‌లో ఉంటున్నాను. ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకుంటే నాన్నగారు నాతో ఉన్నారన్న నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతోనే వేసుకుంటున్నాను. అశ్విన్‌ని మంచి హీరో చేసేవరకూ ఈ డ్రెస్ తీయకూడదు అనుకున్నాను. సినిమా చూసి ఒక మంచి హీరోగా రిసీవ్ చేసుకుంటే నేను నార్మల్ డ్రెస్ లోకి వస్తాను అంటూ తన శపథం గురించి బయటపెట్టారు. అదీ మేటరు.