1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2024 (13:59 IST)

ప్రయోగాత్మక చిత్రంగా 105 మినిట్స్ మూవీ రివ్వ్యూ

105 Minutes, hansika
105 Minutes, hansika
ఈమద్య తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు చాలా తగ్గాయనే చెప్పాలి. కమర్షియల్ ఫార్మెట్ లో సినిమాలే ఎక్కువగా వున్నాయి. అందులో హన్సికతో సింగిల్ క్యారెక్టర్ తో దర్శకుడు రాజు దుస్సా సాహసం చేశాడనే చెప్పాలి. బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమా రిపబ్లిక్ డే నాడు విడుదలయింది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
జాను హన్సిక అర్థరాత్రిపూట కారులో ఇంటికి వస్తూ ఫెట్రోలు కొట్టించుకుని వస్తుండగా ఏవో శబ్దాలు కారులో వినిపిస్తుంటాయి. రోడ్డుగా ఎదురుగా ఎవరో ఆత్మ కనబడుతుంది. భయంతో అలాగే ఇంటికి వస్తుంది. రాగానే కలలో వింతలోకాలు కనిపించినట్లు ఆమెను వెంటాడుతూ ఇంటి నుంచి అడవి అక్కడనుంచి మరో చోటకు ఇలా ఆమె ప్రయాణం సాగుగుతుంది. ఓ మగ వాయిస్ ఆమెను గైడ్ చేస్తుంది. తన మరణానికి నువ్వు కారణమంటూ.. హు ఆర్ యూ.. అంటూ.. స్పందిస్తుంది. వెంటనే ఆమె కాళ్ళకు ఇనుప గొలుసులు కప్పుకుంటాయి. వాటిని విడిపించుకునేందుకు ఆమె ఏమి చేసింది? అసలు ఆ వాయిస్ ఎవరిది? తనలాగే మరో అమ్మాయి ఎందుకు కనిపిస్తుంది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
105 మినిట్స్ లో జరిగే కథగా అర్థమవుతుంది. ఇందులో దర్శకుడు తన ఐడియాను ప్రేక్షకులకు తెలియజేసే విధంగా ట్రావెల్ చేయించాడు. అయితే మొదటి భాగం అంతా గందరగోళంగా వుంటుంది. మనిషికి ఓ దశలో విపరీతమైన కలలు వస్తుంటాయి. ఒక చోట నుంచి మరో చోటుకు ఈజీగా వెళ్ళిపోతుంటాయి. మనమే మరో లోకంలో కనిపిస్తాయి. అడవులు, ఇల్లు ఇలా కొత్త ప్రపంచాన్ని చూస్తాం. ఇందులో హన్సిక పాత్ర కూడా అలానే వుంటుంది. 
 
సింగిల్ షాట్ లో తీశానని దర్శకుడు చెప్పాడు. కానీ కొన్ని చోట్ల కెమెరా కటింగ్ కూడా కనిపిస్తుంది. ఆ జంప్ అనేది కనిపించకుండా దర్శకుడు ట్రిక్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక హన్సిక తన పాత్రలో పలు వేరియేషన్స్ చూపించింది. ముఖ్యంగా భయపడడం, ఆశ్చర్యం వ్యక్తం చేయడం, ఏడవటం వంటి కోణాలు ఆవిష్కరించింది. అయితే ఓ దశలో బోర్ కూడా కొడుతోంది. దానిని మ్యూజిక్ తో మాయ చేసాడు. 
 
ఇటువంటి సినిమాకు సంగీతం, నేపథ్యం, బీజియం లు చాలా ప్రధానం ఆ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లు అనిపిస్తుంది. హన్సిక పాత్రలో ముగింపు ఇంకాక్లారి ఇస్తే బాగుండేది. తన స్నేహితురాలికి జరిగిన ఓ సంఘటన ఆదారంగా ఇలా జరుగుతుందనీ, తను ఏదో రాసుకుంటున్నట్లుగా కనిపించడం సీన్స్ బాగానే వున్నాయి. ముగింపు ఇంకా ఏదో వుందనే భ్రమను కలిగించేలా వుంది.
 
ఒకే ఒక్క పాత్రతో సినిమా అంతా చూపించం చాలా సాహసమనే చెప్పాలి. ఒకప్పుడు ఒకే పాత్రతో అలెగ్జాండర్ అనే నాటకం పేరు పొందింది. దాన్ని దివంగత జయప్రకాష్ రెడ్డి గారు అద్భుతంగా పోషించాడు. ఫోన్ లో అవతలి వ్యక్తి వున్నట్లుగా మాట్లాడడం, ఇక్కడ ఫోన్ ఫేస్ లో హావభావాలు వెరసి ఒకే రూమ్ లో చూపించి థ్రిల్ గురిచేశాడు. ఇంచుమించు దానిని స్పూర్తిగా తీసుకుని కొన్ని వచ్చినా హాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాలు గతంలో వున్నాయి. 
 
దర్శకుడు రాసు దుస్సా సరికొత్త కోణంలో ఈ సినిమా తీశాడనిపించింది. అయితే తెలుగు ప్రేక్షకులు ఒకఫార్మెట్ కు అలవాటుపడిపోయారు కనుక ఇలాంటి అభిరుచి వున్న  వారికి ఇది కనెక్ట్ అవుతుంది. 
 
కిషోర్ సినిమాటో గ్రఫీ ఈసినిమాకు కీలకం. దానిని బాగా ఆవిష్కరించాడు. ఒకే ఇంటిలో వుంటూ మరో లోకంలోకి వెళ్లిపోయినట్లుగా చూపించడం తనకే తనకు తెలీకుండా ఏదో జరగడం అనే విషయాలు చెప్పి థ్రిల్ గురిచేశాడు. ఓటీటీకి ఇలాంటి కాన్సెప్ట్ లు నచ్చుతాయి. ఇక ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వెయిట్ అండ్ సీ. ఫైనల్ గా ఇలాంటి సినిమాన తీసిన నిర్మాతను అభినందించాలి.
రేటింగ్ - 2.5/5