శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (09:26 IST)

ఎనిమిది రోజులు రిహార్సల్స్ చేసిన షార్ట్ అది : 105 మినిట్స్ ట్రైలర్ లో హన్సిక

Hansika
Hansika
హన్సిక హీరోయిన్ గా రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా బొమ్మక్ శివ నిర్మాతగా వస్తున్న సినిమా 105 మినిట్స్. గతంలో విడుదలైన మోషన్, పోస్టర్ థీమ్ సాంగ్ కి మంచి స్పందన లభించగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది. వినూత్న రీతిలో హన్సిక సినిమాలో చేసిన అదే క్యారెక్టర్ గెటప్ లో స్టేజ్ పైకి వచ్చి ట్రైలర్ ని రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది.

ఒకే క్యారెక్టర్ని ఒకే షాట్లో చిత్రీకరించబడిన మొట్టమొదటి ఎక్స్పరిమెంటల్ చిత్రంగా 105 మినిట్స్ సినిమా నిర్మించారు. ఇవాళ పనోరమ స్టూడియో ద్వారా ట్రైలర్ రిలీజ్ చేయగా జనవరి 26న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
 
105-minute team
105-minute team
ఈ సందర్భంగా హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ : 105 మినిట్స్ సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక కంప్లీట్ ఎక్స్పరిమెంటల్ ఫిలిం. 34 నిమిషాల షాట్ ని సింగిల్ టేక్ లో చేయడం అనేది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. 8 రోజులు రిహార్సల్స్ చేసిన షార్ట్ అది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనవరి 26న రిలీజ్ అవుతున్న మా సినిమాను ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

కో ప్రొడ్యూసర్ సుమన్ గారు మాట్లాడుతూ : నిజంగా నిర్మాత బొమ్మక్ శివ గారికి ఎంతో గట్స్ ఉంటే గాని ఇలాంటి కంటెంట్ యాక్సెప్ట్ చేయడం కష్టం. మా మాంక్ ఫిలిమ్స్ సంస్థ కూడా ఇలాంటి ఒక మంచి కంటెంట్ తో డిస్ట్రిబ్యూషన్ థియేటరికల్ గా డిజిటల్ గా చేయాలని అనుకున్నాము. ఈమధ్య థియేటర్ సినిమా ఓ టి టి సినిమా షార్ట్ సినిమా అంటూ రకరకాలుగా వస్తున్నాయి. కానీ సినిమా ఒకటే దానితో అసోసియేట్ అయిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ తీసుకునే విధానాన్ని బట్టి అది థియేటర్ ఓ టి టి అని డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న థియేటర్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులోనే వరల్డ్ వైడ్ రిలీజ్ చేసి తర్వాత డిఫరెంట్ లాంగ్వేజస్ లో పాన్ ఇండియా లెవెల్ లో తీసుకొస్తాం. రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈనెల 26న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు.
 
దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ : మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న నన్ను నమ్మి కంటెంట్ ని నమ్మి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత బొమ్మక్ శివ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ కథను హన్సిక గారి దగ్గర తీసుకెళ్లినప్పుడు ఒప్పుకుంటారా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. కానీ కథ వినగానే సింగిల్ సెట్టింగ్లో నేను సినిమా చేస్తున్నానని ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ కథను నమ్మి ఈ సినిమా చేసిన హన్సిక గారికి కృతజ్ఞతలు. అలాగే మాంక్ ఫిలిమ్స్ సుమన్ గారు కలవడం సినిమా ఇంకా ముందుకు పరిగెడుతోంది. జనవరి 26న ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకుల సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.