బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (17:27 IST)

నెలకొక లాంగ్వేజ్ చొప్పున ప్యాన్ ఇండియా లెవెల్లో 105 మినిట్స్ రిలీజ్ : నిర్మాత బొమ్మకు శివ

Producer Bommaku Siva
Producer Bommaku Siva
హన్సిక గారికి ముందు వేరే హీరోయిన్ అనుకున్నాము. కానీ ఈ కథకి హన్సిక సెట్ అవుతారని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయి ఒప్పుకున్నారు. ఆమె ఈ పాత్రకు న్యాయం చేసింది అని 105 మినిట్స్ నిర్మాత బొమ్మకు శివ తెలియజేసారు. జనవరి 26 న ఈ సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాము మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం అని బుధవారం నాడు చిత్రం గురించి పలు విషయాలు చెప్పారు.
 
-  నేను పుట్టింది పెరిగింది అంత హైదరాబాద్ బోడుప్పల్ లో. రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్ లు ఉన్నాయి. సినిమాలంటే నాకు చాలా ప్యాషన్. ఎప్పటికన్నా ఒక సినిమా నిర్మించాలని కల ఉండింది అది సినిమాతో నెరవేరింది.
 
- ఈ సినిమా కథ నా  దగ్గరికి  రాజు తెచ్చాడు. రాజు నాతో 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఈ కథ విన్నప్పటి నుంచి కథ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువైంది. ఫస్ట్ సినిమా చేస్తే ఈ కథతోనే చేయాలనుకున్నాను.
 
- సినిమా మీద ప్యాషన్ తోనే ఒక కొత్త జోనర్ కొత్త ఎక్స్పరిమెంట్ తో రావాలనుకున్నాం అందుకే 105 మినిట్స్ కథ ని ఎంచుకున్నాం. సింగిల్ ఆర్టిస్ట్ సింగిల్ టేక్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. నార్మల్ గా షూట్ కి 20 డేస్ పడితే ట్రైలర్ దాని ప్రాక్టీస్ చేసుకుని చేయడానికి 45 డేస్ పట్టింది.
 
- హన్సిక స్టార్ హీరోయిన్ గ్లామర్ డాల్ కాబట్టే కొత్తగా చూపించాలి అనుకున్నాం హన్సిక కూడా చేస్తాను అని ఒప్పుకోవడం చాలా పాజిటివ్ గా అనిపించింది. సినిమా మొత్తం ఒకటే క్యారెక్టర్ కానీ ఇంకో వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ కూడా  పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న యాక్టర్ హిందీలో మంచి నటుడు. ఆయన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది.
 
- మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ప్రెసెంట్ వరల్డ్ వైడ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాము మంత్ కి ఒక లాంగ్వేజ్ చొప్పున నెక్స్ట్ ఫైవ్ మంత్స్ ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తాం. మేమైతే ఇంటర్వెల్స్ ఏమి ప్లాన్ చేయలేదు కానీ థియేటర్ వాళ్ళు వాళ్ళ ఇష్టం మేరకు ఇంటర్వెల్ ఇస్తే ఇవ్వచ్చు. సినిమా అనుకున్న బడ్జెట్లోనే తీసాము 3 కోట్లు అనుకున్నాము 3.5 కోట్లు దాకా అయింది అని అన్నారు.