ఆదివారం, 9 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By దేవి
Last Updated : శుక్రవారం, 7 మార్చి 2025 (13:11 IST)

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Ankit Koyya, Shriya Konam
Ankit Koyya, Shriya Konam
మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్రంలో రావ్ రమేష్ కొడుకుగా నటించిన అంకిత్ కోయ్య చేసిన చిత్రం 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో. హర్ష మన్నె దర్శకత్వం వహించగా, సత్య ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సత్య కోమల్ నిర్మించారు. ఈ సినిమా నేడు విడుదల అయింది.  టైటిల్, ట్రైలర్‌తో రాఘవేంద్ర రావు ను ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంధో తెలుసుకుందాం.
 
కథ 
హర్ష (అంకిత్ కోయ్య) డైరెక్టర్ అవ్వాలని కథలు రాస్తుంటాడు. అతని స్నేహితుడు మిస్టర్ కిస్ (వెన్నల కిషోర్) యు టూబర్. హర్ష డేటింగ్ యాప్ ద్వారా అహానా (శ్రియా కొణం)ను కలుస్తాడు. అహానా తల్లిదండ్రులు పెళ్లి కోసం పట్టణం నుండి బయలుదేరినప్పుడు, ఆమె హర్షను తన ఇంటికి ఆహ్వానిస్తుంది. అనతరం జరిగిన ఊహించని పరిణామాల వల్ల 14 రోజులు ఇంటిలో ఉండేలా చేస్తాయి.  ఊహించని పరిస్థితి ఏమిటి? అహానా తల్లిదండ్రులు త్వరగా ఎందుకు తిరిగి వస్తారు? ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
రెండు గంటల లోపు నిడివి ఉన్న ఈ సినిమాలో పరిమిత నటీనటులతో దర్శకుడు బాగా డీల్ చేశాడు. కరోన సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆశక్తిగా మలిచాడు. టీనేజ్ లో డేటింగ్ లో వచ్చిన ఇబ్బందులు వినోదంగా చూపించాడు. టీనేజ్ జంటగా అంకిత్ కోయ్య, శ్రియా కొణం ముచ్చటగా ఉన్నారు. తల్లి దండ్రులు ఇంటికి వచ్చాక వారు పడే సంఘర్షణ ప్రేక్షుకుడికి ఎంటర్ టైన్ కలిగిస్తాయి. ఇద్దరి నటన మెచ్చేలా ఉంది. తల్లి దండ్రులు,  తాత పాత్రలు కథకు అతికాయి. సన్నివేశపరంగా రాసుకున్న మాటలు, సీక్వెల్స్ నాచురల్ గా ఉన్నాయి. వెన్నెల కిషోర్ పాత్ర వినోదాన్ని పండిస్తుంది.
 
కరోన టైములో ఆంక్షలు ఉన్నా మీడియా, సోషల్ మీడియా అంటూ కిషోర్ పోలిస్ లతో, వాచ్ మాన్ తో సాగే సన్నివేశాలు అలరిస్తాయి. వెన్నెల కిషోర్  హైలైట్‌గా చేస్తుంది. ఇంద్రజకు చిన్న పాత్ర ఉన్నప్పటికీ, సహాయక తారాగణం వారి పాత్రలకు న్యాయం చేస్తుంది. ఇంటి కీ కూడా కథకు కీలకం.
 
మార్క్ కె. రాబిన్ సంగీతం కథనాన్ని పెంచుతుంది, పాటలు సినిమా మూడ్‌ను పూర్తి చేస్తాయి. ఇంట్లో ఇరుక్కు పోయిన సన్నివేశాన్ని పాట రూపంలో చక్కగా చూపించాడు. కాని, ఆ పాట గాత్రం సంగీతం మిగేసింది. స్పష్టత లేదు. ఇలా చిన్నపాటి లోపాలు మినహాయిస్తే ఈనాటి యూత్ కు బాగా నచ్చే చిత్రం.  గ్రామీ అవార్డు గ్రహీత ఇంజనీర్ పి.ఎ. దీపక్ అత్యుత్తమ సౌండ్ మిక్సింగ్ కూడా ఈ చిత్రానికి ఉపయోగపడుతుంది. ప్రదీప్ రాయ్ ఎడిటింగ్ స్పష్టంగా ఉంది.  సినిమాటోగ్రాఫర్ కె. సోమ శేఖర్ పరిమిత ప్రదేశాలలో బాగా చూపించాడు. 
 
తల్లిదండ్రుల పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛ, నమ్మకం మధ్య ఉన్న చక్కటి రేఖను కూడా సూక్ష్మంగా చూపించడంలో దర్శకుడు సఫలం చేసారు.   క్లైమాక్స్‌ బాగుంది. కొన్ని సన్నివేశాలు హడావిడిగా అనిపిస్తాయి. అయినప్పటికీ, ఈ చిత్రం ఆలోచనాత్మకమైన మలుపుతో ఆనందించే కామెడీని ఇవ్వడంలో విజయం సాధించింది. ఓ.టి.టి. కి మంచి కాన్సెప్ట్ ఈ సినిమా.
రేటింగ్ : 3/5