గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (12:33 IST)

Custody movie review highlights-నాగ చైతన్య కస్టడీ ఎలా ఉందంటే...

Custody
నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ ఈరోజే విడుదల అయింది. తమిళ్‌లో తెలుగులో శ్రీనివాస్ చిట్టురి నిర్మించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.
 
కథ.
శివ (నాగ చైతన్య) రాజమండ్రిలో సకినేటి పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్. నిజాయతీ గలవాడు. ఎస్ ఐ. రవి అవినీతిపరుడు. ఓసారి సి బి ఐ. ఆఫీసర్, సి.ఎం. నమ్మినబంటు రాజు (అరవింద్ స్వామిని)ని అరెస్ట్ చేసే క్రమంలో శివ పనిచేసే స్టేషన్‌కు వస్తారు. ఆ తర్వాత ఎస్.పి. తన టీంతో వర్చి రాజుని చంపేందుకు ట్రై చేస్తారు. దానికి శివ ఎదుర్కొని రాజుని తీసుకొని, అతనితో పాటు సీబీఐ ఆఫీసర్‌ను తీసుకొని పారిపోతాడు. 
 
తెల్లారి బెంగుళూరు కోర్టులో రాజుని హాజరు పరచాలి. కానీ ఎస్.పి., సీఎం. గుండాలు వెంటపడతారు. ఈలోగా వారితో అనుకోకుండా కృతి శెట్టి జాయిన్ అవుతుంది. ఆ తరవాత ఏమి జరిగింది. అనేది సినిమా.
 
సమీక్ష.
నాగచైతన్య పోలీసుగా బాగా చేశాడు. కృతి శెట్టి ప్రియురాలిగా నటించింది. సీఎంగా ప్రియమణి నటించింది. వెన్నెల కిషోర్,
Custody
కృతినీ ప్రేమించే సీనియర్‌గా ఎంటర్ టైన్ చేశాడు. సీరియస్ మూవీ. యాక్షన్ పార్ట్ కీలకం. నదిలో జీప్‌తో సహా పడిపోయాక యాక్షన్ సీన్స్ బాగున్నాయి. 
 
కథనం అంతా పోరాటాలు రాజుని కాపాడే సన్నివేశాలే ఎక్కువ. సింపుల్ కథ. తమిళ్, మలయాళ నటులు కూడా నటించారు. లేడీ సీఎం కథ కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో వారికి కనెక్ట్ అవుతుంది. సినిమా మొత్తంగా ఫీల్ మిస్ అయింది. ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేదు.
 
సంగీతం ఇళయరాజా నేపథ్యం బాగుంది. 1996 నాటి బ్యాక్ డ్రాప్ కాబట్టి బాగున్నాయి. పాటలు పెద్దగా లేవు. డైలాగ్స్ సింపుల్‌గా ఉన్నాయి. పెద్దగా కొత్తదనం లేని కథ. ఫ్యాన్స్ ఏవిధంగా తీర్పు చెపుతారు అనేది చూడాలి.
 
రేటింగ్. 2.5/5