నటీనటులు: అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్ తదితరులు
సాంకేతికత- సినిమాటోగ్రఫీ: సత్యజిత్ పాండే (సేతు), ఎడిటర్: హేమంతి సర్కార్, సంగీత దర్శకుడు: తనూజ్ టికు, ప్రీతమ్, నిర్మాతలు: అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధరే, దర్శకత్వం : అద్వైత్ చందన్
ఎప్పుడో 28 ఏళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్. ఆరు ఆస్కార్‌లు అవార్డులు దక్కించుకుంది. అప్పటి హాలీవుడ్ రాజకీయాలకూ సైనికుడి కుటుంబానికి లింక్ పెడుతూ చేసిన సినిమా. ఇప్పుడు అమీర్ ఖాన్ దానిని హిందీలో భారతీయ కోణంలో తీశారు. అదే లాల్ సింగ్ చడ్డా . నాగచైతన్య కూడా ఇందులో వుండడం, చిరంజీవి తెలుగులో విడుదలచేయడం, తమిళంలో ఉదయనిధి స్టాలిన్ విడుదల చేశారు. ఇలా దక్షిణాదిలోనూ అన్ని భాషల్లోనూ నేడు విడుదలైంది. మరి అదెలా వుందో చూద్దాం.
కథ
లాల్ సింగ్ చడ్డా ( అమిర్ ఖాన్) బుద్ధిమాంద్యం వున్న పిల్లాడు. అతని ముత్తాత, తాత, నాన్న కూడా మిలట్రీలో చేరి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. బుద్ధిమాంద్యంతోడు నడకకూడా సమస్య కావడంతో పిల్లాడికి ధైర్యం నూరిపోసి పెంచుతుంది తల్లి మోనాసింగ్. స్కూల్లో ఫ్రెండ్ రూపా (కరీనా కపూర్) ప్రోత్సాహంతో నడకను జయిస్తాడు. అలాగే కాలేజీనూ రన్నింగ్‌లో ఫస్ట్‌గా నిలుస్తాడు. అలా పెద్దయ్యాక ఆర్మీలో జాయిన్ అవుతాడు. అక్కడ ట్రైనింగ్‌లో బాల (నాగచైతన్య)తో స్నేహం ఏర్పడి మంచి స్నేహితులుగా మారతారు. ఆ సమయంలో వీరు కార్గిల్‌వార్‌లో పాల్గొనాల్సివస్తుంది. ఆ సమయంలో జరిగిన యుద్ధంలో బాలను కోల్పోతాడు లాల్. ఆ తర్వాత బయటకు వచ్చిన లాల్, బాల ఆశయం అయిన బన్నీ, చెడ్డీ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లు సంపాదిస్తాడు. ఈలోగా రూపా డబ్బు సంపాదనకోసం బాలీవుడ్ వెళుతుంది. రూపపై ప్రేమను చూపించే లాల్ చివరికి ఆమె ప్రేమ దక్కిందా? లేదా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ-
ఫారెస్ట్ గంప్ అనేది వియత్నాం, అమెరికన్ వియత్నాంకు సాయం చేయడాన్ని అమెరికన్లే వ్యతిరేకించే నేపథ్యంలో సాగుతుంది. అందుకే మన దగ్గరకు వచ్చేసరికి ఇందిరాగాధీ ఎమర్జెన్సీ నుంచి దానిని ఎత్తివేసే సందర్భం ఆ తర్వాత లాల్ కిషన్ అద్వానీ రథయాత్ర, రామమందిర్ కూల్చివేత వంటి సంఘటనలు, ఇందిరాగాంధీని సిక్కు రక్షకుడు చంపేయడం వంటి సన్నివేశాలకు అనుగుణంగా కథను రాసుకున్నారు.
ప్లస్ పాయింట్‌లు
- బుద్దిమాంద్యం వున్న పిల్లల్ని తల్లి, స్నేహితుల సపోర్ట్‌తో ఏ స్థాయికి ఎదగవచ్చో చూపించాడు.
- ఇండియాలో శ్రతువులే వుంటారంటూ తమకు నూరిపోసి పోరాడిన తర్వాత ఏమైపోయామో పట్టించుకునేవాడులేడంటూ.. టెర్రరిస్టుచేత చెప్పిస్తాడు.
- అమీర్ ఖాన్ నటన పిల్లాడిలా బుద్ధిమాంద్యం వున్న వ్యక్తిగా బాగా సరిపోయాడు.
- నాగ చైతన్య బాలరాజు పాత్రలో కొత్తగా కనిపిస్తాడు.
మైనస్‌లు-
- రూప తల్లిని ఆమె తండ్రి చంపినట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఆమె కూతురుని వదిలేసి వేరే క్రిస్టియన్‌ను పెండ్లిచేసుకుందని చెప్పడం ఆశ్చర్యంగా వుంది.
- లాల్, కార్గిల్ యుద్ధంలో రెండు కాళ్ళు పోయిన పాకిస్తాన్ టెర్రరిస్టు నాయకుడిని కాపాడతాడు. అతను తన సహోదర సైనికుడు అనే భ్రమలోనే వుంటాడు. కానీ బుద్ధిమాంద్యం వున్న వాడిని సైనికుడిగా ఎలా తీసుకుంటారనేది క్లారిటీలేదు.
- బన్నీ, చడ్డీ బిజినెస్‌కు కాళ్ళులేని పాకిస్తాన్ టెర్రరిస్టు మార్కెటింగ్ హెడ్‌గా వుండి లాల్‌కు కోట్లు సంపాదించేలా చేస్తాడు.
- కొన్ని సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి.
- మెయిన్ గా సెకండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది
ఇందులో రెండు, మూడు సార్లు అమీర్ ఓ డైలాగ్ చెబుతాడు. పానీ పూరీ తింటే కడుపు నిండినట్లుంటుంది. కానీ మనసు నిండదు. అని.. ఈ సినిమా కూడా అలానే వుంది.
రేటింగ్- 2.25/5