శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (10:13 IST)

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

Jatara
Jatara
తారాగణం: సతీష్ బాబు రాటకొండ, దీయా రాజ్, ఆర్కే నాయుడు, మహబూబ్ పాషా షేక్ మరియు ఇతరులు
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్: కేవీ ప్రసాద్, సంగీత దర్శకుడు: శ్రీజిత్ ఎడవన, రచన & దర్శకత్వం: సతీష్ బాబు రాటకొండ, నిర్మాత: ద్వారంపూడి రాధాకృష్ణ రెడ్డి, సహ నిర్మాత: ద్వారంపూడి శివ శంకర్ రెడ్డి, విడుదల తేదీ: 8 నవంబర్ 2024
 
కథానాయకుడిగా, దర్శకత్వం వహించి, హీరోగా నటించిన తొలి నటుడు సతీష్‌బాబు రాటకొండ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్ కమర్షియల్ సినిమా జాతర. ట్రైలర్ తన ప్రత్యేకమైన కంటెంట్ విజువల్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. మరి జాతర మూవీ ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ:
ఓ గ్రామానికి సంబంధించిన కథ. ఆచారం ప్రకారం గ్రామ దేవతను పూజించే ఆలయ పూజారి పాలేటితో కథ మొదలవుతుంది. ప్రతి ఏడాది అమ్మవారికి జాతర జరుగుతుంది. అతని ఏకైక కుమారుడు చలపతి (సతీష్ బాబు రాటకొండ) నాస్తికుడిగా వుంటాడు. ఆ ఊరికి నాటకాలు ఆడే కుటుంబం వస్తుంది. ఊరికి చెందిన పెద్ద దిక్కు గంగిరెడ్డి (ఆర్కే నాయుడు) వారికి ఆశ్రయం ఇస్తాడు. అందులో వెంకట లక్ష్మి (దీయ రాజ్, చలపతి ప్రవర్తనకు అతనిపై ప్రేమను పెంచుకుంటుంది.
 
ఆవారాగా జీవితం సాగుతున్న చలపతికి ఎదురైన సంఘటనతో ఓ అఘోరా ద్వారా తన తండ్రి మిస్సింగ్ గురించి తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది. అలా గంగావతి గ్రామదేవతలు కలలో వచ్చి పాలేటికి ఇక్కడే ఉండి గ్రామాన్ని దురాచారాల నుండి రక్షించమని కోరుతుంది. ఇంతలో, గంగి రెడ్డి (RK నాయుడు) ఊరి పెద్దగా తన బాగుకోసమే గ్రామ దేవతలను శాశ్వతంగా ఉండడానికి తన ఇంటికి తీసుకువస్తాడు. ఆ తర్వాత ఏమయింది? తన తండ్రి గురించిన రహస్యాన్ని చలపతి ఛేదించాడా? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
ఈ చిత్రాన్ని గమనిస్తే ప్రధానభాగం కాంతార సినిమాను గుర్తుకు తెస్తుంది. జాతర నేపథ్యంలో సాగుతున్న కథ కనుక గ్రామ దేవత అమ్మవారి నేపథ్యంగా కథ సాగుతుంది. ఈ సినిమాకు సతీష్ బాబు రాటకొండ ఈ చిత్రంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తన మల్టీ టాలెంటెడ్ వర్క్‌ని నిరూపించుకున్నాడు. అన్నీ తానే అవడంతో కొంత గందరగోళంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే కాంతార ఛాయలు కనిపించాయో అంతకుమించి వుండేలా ప్రేక్షకుడు కోరుకుంటాడు. కొన్ని చోట్ల అలాంటి ఫ్లేవర్ చూపించినా మరికొన్ని చోట్ల ఆ డెప్త్ ను ఇవ్వలేకపోయాడు. ముఖ్యంగా ఆ గ్రామంలోని ప్రజలే నటించడంవల్ల కథకు సింక్ అయినా వారిని మరింతగా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అందరికీ బేస్ వాయిస్ వుండడంతో హీరోను డామినేట్ చేసేలా పాత్రలు కనిపిస్తాయి. దాన్ని తదుపరి చిత్రంలోనైనా సరిచేసుకుంటేబాగుంటుంది.
 
ముఖ్యంగా విలన్‌తో క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులను థ్రిల్ కలిగిస్తుంది. నాయిక దీయా రాజ్ తన పాత్రలో అమరింది. ఆమె డైలాగ్స్ డెలివరీ, అమాయకత్వం భావోద్వేగాలు  సరైన మిక్స్‌తో స్క్రీన్ స్పేస్‌ను సరిపోల్చగలిగింది. RK నాయుడు గంగిరెడ్డి పాత్రలో కనిపించాడు. తను తక్కువ కులంవాడైనా ఊరి పెద్ద రెడ్డిని చంపించి తానే రెడ్డిగా మారడం అనే అంశం ప్రజలకు తెలిసిన కథగా అనిపిస్తుంది. బత్తుల లక్ష్మి, రాము గల్లా, గల్లా మంజునాథ్, మహబూబ్ పాషా షేక్ తదితరులు పర్వాలేదు అనిపిస్తారు.
సాంకేతికంగా:
 
దర్శకుడు సతీష్ బాబుకు కథ చెప్పడంలో బాగా చెప్పాలన్న తపన వున్నా ఇంకొంచెం కసరత్తు చేయాల్సింది.  ప్రతి సన్నివేశాన్ని ట్విస్ట్‌లను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులకు వివరించడానికి సినిమాను స్వచ్ఛమైన భావోద్వేగ  సాంప్రదాయ పద్ధతిలో ప్రదర్శించడానికి అతను తన స్క్రీన్‌ప్లేను పూర్తిగా సమకాలీకరించాడు. ఇంతకుముందు ఓ సినిమా తీసిన రాధాకృష్ణ ప్రొడక్షన్ బేనర్ మంచి సినిమా తీయాలనే తాపత్రయం కనిపించింది. శ్రీజిత్ ఎడవనా సంగీతం సాదాసీదాగా వుంటుంది. సినిమాటోగ్రాఫర్ కె.వి.ప్రసాద్ పని తనం ఓకే అనిపించేలా వుంది. పల్లెటూరి అందాలను, దేవత సన్నివేశాలను ప్రదర్శించడంలో అతని దృష్టి చాలా బాగుంది బి.మహేంద్రనాథ్ ఎడిటింగ్ ఇంకాస్త పనిచెప్పాల్సింది.
 
ఎప్పుడైనా పల్లెటూరి సంస్కృతిని తెలియజెప్పే జాతర  పూర్తి అంశాల మిక్స్‌గా ఉంటుంది, గ్రామాల్లో నమ్మకాలు, ఊరిపెద్ద అరాచకాలు అనేవి కామన్. దానిని మరింత ఎఫెక్ట్ చూపిస్తే బాగుండేది. సినిమాలో కొన్ని సర్ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు ఉంటాయి. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలలో ఖచ్చితంగా ఆకట్టుకునేలా చూపారు. మొత్తంగా ఇది ఊరి జాతరలు ఇష్టపడేవారికి నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5