గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (20:06 IST)

మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎలావుందంటే.. రివ్యూ

Parvatheesham  Pranikanvika
Parvatheesham Pranikanvika
నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు.
 
టెక్నికల్ టీమ్: రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్,  ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు, సంగీతం: జో ఎన్మవ్,  సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల, ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి
పాటలు: వియస్ ముఖేష్, జో ఎన్మవ్, బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్. పిపీఆర్వో: తిరుమలశెట్టి వెంకటేష్

బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమాను నేడు ప్రముఖులకు ప్రివ్యూ ప్రదర్శించారు.మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
Parvatheesham  Pranikanvika
Parvatheesham Pranikanvika
కథ: 
గుమస్తాగా పని చేసే కేదార్ శంకర్ కు భార్య, కుమారుడు, కుమార్తె వుంటారు. కొడుకు పార్వతీశంను సాఫ్ట్ వేర్ కోర్సు చేయిస్తాడు. అదంతా పెట్టుబడిగా భావిస్తాడు కేదార్. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న పార్వతీశం కు పెళ్లి చేయాలని దాని ద్వారా కట్నం భారీగా రాబట్టాలనుకుంటాడు. అందుకు విరుద్ధంగా తనకు నచ్చిన అమ్మాయిని స్థాయి తక్కువైనా చేసుకోవాలని నిర్ణయానికి వస్తాడు పార్వతీశం.
 
పెండ్లి సంబంధాల గోల భరించలేక ఓసారి తల్లితో కూరగాయల మార్కెట్ కు వస్తాడు. అక్కడ  కూరగాయలు అమ్ముతూ స్వతంత్రంగా జీవించే మహాలక్ష్మి ని (ప్రణీకాన్విక) చూసి లవ్ చేస్తాడు. ఆమె తిరస్కరించినా ఆమె వెంటే పడుతూ నాలుగురోజుల్లో ఆమెను తనదారికి తీసుకువస్తాడు. ఆమె తండ్రి పక్షవాతంతో మంచాన పడడం, అన్న కోటర్ కృష్ణ(మహబూబ్ బాషా) తాగుడుకు బానిస అవడంతో మహాలక్ష్మే తన కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. సరిగ్గా మహాలక్మి, పార్వతీశంను ప్రేమించే టైంలో  ఓ సంఘటన ఆమె మనసును గాయపరుస్తుంది. ఆతర్వాత ఏమయింది? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
అచ్చమైన తెలుగు కథకు వున్న అంశాలు ఇందులో వున్నాయి. మధ్యతరగతి అమ్మాయి, పక్షవాతం తండ్రి, తాగుబోతు అన్న. కొంచెం స్థాయి వున్న పార్వతీశం, ప్రతీదీ లెక్కలు కట్టే తండ్రి కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మలిచాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్, మార్కెట్ లో కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించడం అనేది ఇందులో కీలకం. అయితే ఆ క్రమంలో  తండ్రి పోరు భరించలేక మార్కెట్ లోనే వుండే సన్నివేశాలలు, పాత్రలు ఎంటర్ టైన్ చేస్తాయి.
 
ముఖ్యంగా కొంతమంది తండ్రులు కొడుకును పెట్టుబడిగా భావించి పెండ్లిని వ్యాపారంగా మార్చే కథలు ఇంతకుముందు వచ్చినా ఇది కొంచెం సరికొత్తగా రాసుకున్నాడు. అందుకు డైలాగ్ లు బాగా ఉపయోగపడ్డాయి. సంబంధం, బంధం అనే దానికి సరియైన వివరణ ఇచ్చి ఇప్పటి తరానికి తెలిసేలా చేశాడు. ఇండిపెండెంట్‌గా బతికే ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే.. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా తను చూసుకుంటుందనే భరోసా ఉంటుందని ఆలోచించే హీరో కథే ఈ ‘మార్కెట్ మహాలక్ష్మి’. దీనిని సరిగ్గా చెప్పగలిగాడు. అయితే ఆ క్రమంలో చిన్నపాటి పొరపాట్లు సరిదిద్దుకుంటే బాగుండేది. మార్కెట్ లో ఇండివిడ్యువల్ గా ఎదిగే మహాలక్మి స్ట్రగుల్ మరింత వివరంగా చూపిస్తే మరింత ఆకట్టుకునేది.
 
కేరింతలో అమాయకుడిగా  నటించిన పార్వతీశం ఈ సినిమాకు వచ్చేసరికి మాడ్యులేషన్ లో మెరుగుబాగా కనిపించింది. పాత్ర పరంగా సూటయ్యాడు. మహాలక్మి పాత్రలో తెలంగాణ యాసతో  ప్రణికాన్విక జీవించింది.  కమెడియన్ ముక్కు అవినాష్, హర్షవర్ధన్, కేదార్ శంకర్, జయ, పద్మ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
 
ఇక దర్శకుడు అనుకున్న విషయాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. జో ఎన్మవ్ ఇచ్చిన సంగీతం ఓ మేరకు పర్వాలేదు అనిపించినా, ఆశించిన స్థాయిలో లేదు. సృజన శశాంక బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సింపుల్ కథతో లావిష్ సందేశంతో కూడిన ఈ సినిమా కుటుంబసమేతంగా చూడదగింది.
రేటింగ్: 2.75/5