సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (11:48 IST)

కేరింత స్థాయిలో మార్కెట్ మహాలక్ష్మి పేరు తెస్తుందని నమ్ముతున్నా : హీరో పార్వతీశం

Parvatheesham - Pranikanvika
Parvatheesham - Pranikanvika
"మార్కెట్ మహాలక్ష్మి" ట్రైలర్ ఒక తండ్రి తన కొడుక్కి పెళ్లి, కట్నం కోసమే చేయాలనుకోవడంతో మొదలవుతుంది. ఈ చిత్రం ట్రైలర్  విభిన్నంగా అందరిని ఆకట్టుకునేలా ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి 
 
తండ్రి కొడుకుకి ప్రపోజల్స్ తీసుకురావడం,  సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన పార్వతీశం వాటిని తిరస్కరించడం. ఇలా ఉండగా ఒక రోజు మార్కెట్లో మహాలక్ష్మి నీ చూసి ప్రేమలో పడతాడు హీరో. ఆ తర్వాత తనని ఇంప్రెస్ చేయడానికి జరిగిన సిచువేషన్స్, కష్టాలు, చివరికి వీరేలా కలిశారన్నదే మిగతా కథ. ట్రైలర్‌లో ఆసక్తికరమైన "వర్క్ ఫ్రమ్ మార్కెట్" కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఈ సింపుల్ ట్రైలర్ ఒక మంచి ఫన్ ఫిలిం ని సూచిస్తుంది. ఎమోషన్, ఫన్, సింపుల్ మూమెంట్స్‌తో కూడిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పార్వతీశం మరియు ప్రణికాన్విక మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
 
Parvatheesham - Pranikanvika  and others
Parvatheesham - Pranikanvika and others
కేరింత ఫెమ్ హీరో పార్వతీశం, నూతన హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. 
 
హీరో పార్వతీశం మాట్లాడుతూ.. ''ఫ్రాంక్ గా చెప్పాలంటే.. కేరింత తర్వాత మంచి హిట్‌ కొట్టలేకపోయాను. వరుస నిరాశల తర్వాత నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, అప్పుడే మనోడు ముఖేష్‌ నాకు కథ చెప్పాడు. మొదట్లో దర్శకుడిపై నమ్మకం లేదు. కానీ 4-5 రోజుల షూటింగ్ తర్వాత అతనిపై నాకు నమ్మకం ఏర్పడింది. కేరింత చిత్రానికి ఎంత మంచి పేరు వచ్చిందో అదే విధంగా మార్కెట్ మహాలక్ష్మి నాకు మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నాను. 
 
హీరోయిన్ ప్రణీకాన్విక మాట్లాడుతూ.. ‘‘తెలుగులో ఇది నా మొదటి సినిమా, సోషల్ మీడియాలో మా ప్రమోషన్స్‌కి వస్తున్న రెస్పాన్స్‌ని చూస్తున్నాను. మంచి టాలెంట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు, మార్కెట్ మహాలక్ష్మి లో మహాలక్ష్మిగా నన్ను ప్రేమించి ఆదరిస్తారని నమ్మకం ఉంది. 
 
నటుడు ముక్కు అవినాష్ మాట్లాడుతూ, ఇందులో రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికతో నా కాంబినేషన్ సీన్స్ నవ్విస్తాయి. దర్శకుడు నా క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. మార్కెట్ మహాలక్ష్మిని థియేటర్లలో చూసి మా టీమ్‌కి సపోర్ట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి మరియు నిర్మాతకి థాంక్స్"
 
డైరెక్టర్ 'వియస్ ముఖేష్' మాట్లాడుతూ.. ‘‘నేను కథ రాసుకున్నప్పుడు టైటిల్ వెంటనే తట్టింది, మార్కెట్ మహాలక్ష్మి. అప్పుడే ఫిక్స్ అయ్యాను. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి హీరోలు, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు అయ్యితే బాగుంటుంది అని కానీ, బడ్జెట్ పరిమితుల కారణంగా, మేము పార్వతీశం మరియు ప్రణీకాన్వికా ని మాత్రమే తీసుకోగలిగాము."
 
నిర్మాత అఖిలేష్ మాట్లాడుతూ, "సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ ధన్యవాదాలు. మేము కంటెంట్ ‌పై నమ్మకం ఉంచాము. మార్కెట్ మహాలక్ష్మిని ప్రజలు ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. మా సినిమాను థియేటర్లలో చూడండి మాకు సపోర్ట్ చేయండి" అని అన్నారు.
 
సంగీత దర్శకుడు జో ఎన్మవ్ మాట్లాడుతూ.. "నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ముఖేష్‌కి, నిర్మాతకు కృతజ్ఞతలు. సినిమా ఫ్రెష్‌ ఫీల్‌ని అందిస్తుంది. ఇందులో జానపద పాటలు, మెలోడీలు, ఫ్యూజన్, క్లాసికల్ పాటలు ఉన్నాయి, అందరికీ నచ్చుతాయి.