ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 9 మార్చి 2024 (19:47 IST)

వినసొంపుగా కలియుగం పట్టణంలో నుంచి నీ వలనే.. పాట

Vishwa Karthikeya - Ayushi Patel
Vishwa Karthikeya - Ayushi Patel
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న  ఈ చిత్రాన్ని డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. 
 
రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదల చేసిన మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.
 
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచారు.  ఈక్రమంలోనే చిత్రం నుంచి మంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'నీ వలనే' అంటూ సాగే ఈ మెలోడి పాటను ఎం.ఎం.మానసీ ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. అజయ్ అరసాద అందించిన చక్కటి బాణీ ఎంతో వినసొంపుగా ఉంది.  ఈ చిత్రాన్ని మార్చి 22న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.