గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (23:41 IST)

ఆపరేషన్ వాలెంటైన్ ఎలా ఉందంటే? ఫస్ట్ రివ్యూ

Operation Valentine
Operation Valentine
వరుణ్ తేజ్ హీరోగా మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ నటి మానుషి చిల్లర్, రుహాని శర్మ, నవదీప్ తదితరులు నటించిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. తెలుగు-హిందీలో రూపొందిన ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’, ‘సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్’ వారు నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్, నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 1న ఈ చిత్రం విడుదలకాబోతుంది. ముందుగానే రాత్రి పెయిడ్ ప్రివ్యూలు హైదరాబాద్ లో వేశారు. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ:
గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ అర్జున్ (వరుణ్ తేజ్). అతని తోటి కమాండర్లు నవదీప్, అహన (మానుసి చిల్లర్). యుద్ధంలో ఎదురుదాడి చేసేవారికి కనిపించకుండా ఇరవై మీటర్ల ఎత్తు నుంచి దిగి దాడిచేస్తే విజయం సాధిస్తామనే కాన్సెప్ట్ తో ఆపరేషన్ రుద్ర ప్రాజెక్ట్ చేస్తాడు అర్జున్. తెచ్చికల్ గా అధి వికటించడంతో తోటి సైనికుడు నవదీప్ చనిపోతాడు. ఆ తర్వాత కశ్మీర్ ప్రాంతంలో డ్యూటీ పడుతుంది. ఆ తరుణంలో పాకిస్తాన్ నుంచి ఆయుధాలతో కశ్మీర్ లో ఎటాక్ జరుగుతుందని తెలిసి అర్జున్ ను అధికారులు ఆపరేషన్ లో జాయిన్ చేస్తారు. యుద్ధం లో పాల్గొని విజయంతో తిరిగి వస్తుండగా, పుల్వామా ప్రాంతంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు కారు బాంబుతో నలభై మంది సైనికులను చంపేస్తారు. పై నుంచి అది చూసి తట్టుకోలేక పాకిస్తాన్ పై కొత్త ఆపరేషన్ లో తాను పాల్గొంటానని అధికారులకు చెబుతాడు. మరి వారు ఏమన్నారు? అప్పటికే ఒక ప్రాజెక్ట్ వికటించింది కనుక అర్జున్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అన్నది  మిగిలిన కథ.
 
సమీక్ష:
యుద్ధ నేపథ్య సినిమాలు అనగానే అందులో ఎయిర్ ఫోర్స్ చిత్రాలు అనగానే సీరియస్ గానే ప్రత్యర్థి దేశంపై దాడి చేయడం ప్రతి దాడి చేయడం వంటివి హాలీవుడ్ సినిమాలలో చూసేశాం. అంత లేకపోయినా దర్శకుడు తను రాసుకున్న కథకు తగినవిధంగా యుద్ధ విన్యాసాలు చూపించాడు. టెక్నికల్ గా బాష, పాకిస్తాన్ యుద్ధం చేయడానికి వాడే కోడ్ బాష ఆపరేషన్ నెహ్రూ.. అనేవి కొత్తగా ప్రేక్షకులకు తెలుస్తాయి.
 
సీరియస్ మూవీలో మానుషీ చిల్లర్ తో ప్రేమాయణం వున్నా, డ్యూటీ పరంగా ఆమె ఏవిధంగా బిహేవ్ చేస్తుందనేది బాగానే డీల్ చేశాడు. ఇలా ఎయిర్ ఫోర్స్ లో వుండేవారు విధివిధానాలు మనకు తెలుస్తాయి. 
 
రొటీన్ సినిమా కాదు గనుక పెద్దగా ట్విస్ట్ లుండవు. పనిషిమెంట్ పేరుతో అర్జున్ కు పై అధికారులు దేశ భద్రతను అప్పగించే విధానం లాంటి ట్విస్ట్ ఇందులో వుంటుంది. సంభాషణలు బాగున్నాయి, వరుణ్ తేజ్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ అందరినీ అలరిస్తుంది. 
 
ఇంతకుముందు ఆర్మీ నేపథ్యంలో వరుణ్ తేజ్ కంచె సినిమా తీసి సక్సెస్ సాధించాడు. అందులోమానవీయ కోణాలున్నాయి. ఆ తర్వాత అంతరిక్షం అనే మరో సినిమాలో నటించాడు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఆపరేషన్ వాలెంటైన్ చేశాడు. ఇందులో  టెర్రరిస్టుల దాడిలో సైనికులు చనిపోవడం అనేది మానవీకోణంలో చూపినా, అందులో ఇంకా సెంటిమెంట్ పరంగా అర్జున్ కు సంబంధించిన కుటుంబీకులు వున్న కోణంలో దర్శకుడు కథను రాసుకుంటే మరింత బలంగా వుండేది.
 
కేవలం ఎయిర్ లో యుద్ధ విమానాలు ఎలావుంటాయి. బోర్డర్ దాటి వెళితే పర్యావసనాలు ఏమిటి? అందుకు అర్జున్ లాంటి వాళ్ళు ఎంత ధైర్యంగా, ఆలోచనపరంగా వుండాలనేవి ఇందులో చూపించాడు. ఇక సన్నివేశానికి తగినట్లు మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ గా వున్నాయి.
 
ఇంతకుముందు దర్శకుడు ఎయిర్ ఫోర్స్ పై షార్ట్ ఫిలిం తీసి వారిని మెప్పించాడు.  ఇప్పుడు ఈ సినిమాను తీసి వారినే మెప్పించాడు. కామన్ మేన్ కు దేశభక్తి చిత్రంగా నిలుస్తుంది. కమర్షియల్ పరంగా పెద్దగా వర్కవుట్ కాదు.
 
రొటీన్ గా వస్తున్న సెంటిమెంట్, యాక్షన్ సినిమాలకంటే కొత్తగా  చేసిన ఈ ఆపరేషన్ చాలా బెటర్. పలు ఫిలింఫెస్టివల్స్ కు ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఒక మంచి సినిమా తీశారని చెప్పగలం. సిజి వర్క్ కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సిజి వర్క్ కోసం మొత్తంగా రూ. 5 కోట్ల మేర ఖర్చు చేసారనే టాక్ వుంది.  దేశ భక్తి ని కలిగించే  మంచి సినిమా తీశారని చెప్పవచ్చు.
రేటింగ్ :3/5