ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (13:02 IST)

ప్రియదర్శి, నభా నటేష్ లు డార్లింగ్ తో అలరించారా ! రివ్యూ

Priyadarshi  Nabha Natesh niharika
Priyadarshi Nabha Natesh niharika
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు. జూలై 19న విడుదలైంది.
 
కథ:
రాఘవ్ (ప్రియదర్శి)కి తల్లి బోధతో చిన్నతనంలోనే చదువుకుని పెండ్లి చేసుకుని పారిస్ కు హనీమూన్ వెళ్ళాలనేది గోల్ తో వుంటాడు. పెద్దయ్యాక ట్రావెల్ సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. పెళ్లీడు వయసురావడంతో తల్లిదండ్రులు నందిని (అనన్య నాగళ్ళ)తో పెండ్లి నిశ్చయం చేస్తారు. పీటలమీద వుండగానే నందిని తన లవర్ తో జంప్ అవుతుంది. 
 
ఆ తర్వాత చుట్టూవున్నవారి మాటలకు జీవితంపై విరక్తి పుట్టి చావడానికి కొండపైకి వచ్చి సిద్ధ మవుతుంటాడు. ఆ టైంలో అక్కడే వున్న ఆనంది (నభానటేష్) ధైర్యం నూరిపోస్తుంది. దాంతో ఇలాంటి అమ్మాయి తన జీవితభాగస్వామి కావాలని ఫిక్స్ అయి తల్లి దండ్రులకు పరిచయం చేసి ఆమె పరిచయం అయిన ఆరుగంటల్లోనూ పెండ్లిచేసుకుంటాడు.
 
ఇక మిగిలింది హనీమూన్ కు పారిస్ వెల్ళడమే. కానీ అది జరగదు. పెళ్ళయాక ఆనంది హీరోకు సినిమా చూపిస్తుంది. ఆమె ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేయడంతో డాక్టర్ కు చూపిస్తే ఆమెలో మల్లీపుల్ స్ల్పిట్ పర్సనాలీటీ అనే జబ్బు వుందని తేల్చి చెబుతుంది. ఆ తర్వాత రాఘవ్ ఏంచేశాడు? ఆనంది మామూలు మనిషిగా మారిందా? ఈక్రమంలో జరిగే కథే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మూవీ. కథకూడా అలానే దర్శకుడు రాసుకున్నాడు. హీరోయిన్ బేస్డ్ మూవీ. ఒక మనిషిలో ఐదు క్యారెక్టర్లు వుండడం అనేది బహుశా తెలుగులో ఇదే మొదటి సినిమా అనుకుంట. గతంలో లారెన్స్ చేసిన కాంచనలో పలు షేడ్స్ లా నభా పాత్రలో వుంటాయి. మల్లీపుల్ స్ల్పిట్ పర్సనాలీటీ పాత్రల్లో నభా బాగానే నటించింది. అమాయకుడైన భర్తగా, భయంతోనూ గందరగోళంగా వుండే విధంగా తన పాత్రకు ప్రియదర్శి మెప్పించాడు.
 
ఈ సినిమాలో రెండు పాయింట్ ల ఆదారంగా కథ ముడిపడి వుంటుంది. చిన్న తనంలో తల్లిదండ్రులు ఏది చెబితే అదే నమ్మి దాన్ని బేస్ చేసి జీవితంలో ఎదగాలనుకునే అబ్బాయి కథ ఒకవైపు. మిలియనీర్ అయిన తల్లిదండ్రులు ఒక్కగానొక్క కుమార్తెను సరిగ్గా పట్టించుకోకుండా వుండే కథ మరోవైపు. ఈ క్రమంలో దర్శకుడు ముగింపు రిచ్ గా వుండాలనుకున మధ్యలో కొన్ని స్ల్పిట్ పర్సనాలీటీ జోడించి కన్ ప్యూజ్ చేశాడు.
 
కాంచనలో ఐదుగురు ఓ వ్యక్తిని చంపడానికి కారకులైతే చనిపోయిన వ్యక్తి లారెన్స్ లో ప్రవేశించి రకరకాలుగా ప్రవర్తించి ప్రతీకారం తీర్చుకోవడంలో కథనం ఆసక్తిగా వుంటుంది. ఇక డార్లింగ్ లో హీరోయిన్ లో ఒక పాత్ర మినహా మిగిలిన నలుగురు ఎందుకు వస్తారనేందుకు క్లారిటీ చూపలేదు. మిలినియర్ కూతురును టచ్ చేయాలంటేనే భయపడుతుంటారు. అలాంటిది చిన్న తనంలో ఆమెను టచ్ చేసిన డెబ్బై ఏళ్ళ ముసలివాడి కథ చెప్పిన  అతికినట్లు లేదు. ఈ పాయింట్ లను మరింత జాగ్రత్తగా దర్శకుడు రాసుకుంటే సరికొత్తగా డార్లింగ్ సినిమా వుండేది.
 
దర్శకుడు నభాలో అపరిచితుడు వున్నట్లు భ్రమించేసి ఆ డైలాగ్ లుకూడా హీరో చేత చెప్పిస్తాడు. అందుకే అది ఫన్ మూవీగా మార్చినట్లు కనిపిస్తుంది. ముగింపులో నీహారిక కొణిదెల వచ్చి ట్విస్ట్ ఇస్తుంది. మొత్తంగా చూస్తే, మొదటి భాగంలో హీరో చావడానికి సిద్ధమైతే హీరోయిన్ కాపాడుతుంది. రెండో భాగంలో హీరోయిన్ చావాలనుకుంటే హీరో కాపాడతాడు. ఇలాంటి కథను ఎంటర్ టైన్ మెంట్ లో చూపించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం మంచిదే. ఇటువంటివి ఓటీటీకి కరెక్ట్ గా సరిపోతాయి.
 రేటింగ్: 2. 5/5