ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 జులై 2024 (17:01 IST)

డార్లింగ్ కథ వినగానే సెట్స్ కి వెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయ్యా : నభా నటేష్

Nabha Natesh
Nabha Natesh
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. 
 
మళ్ళీ మూవీస్ లోకి కమ్ బ్యాక్ ఇచ్చారు.  ఎలా ఫీలౌతున్నారు ? 
 
-దాదాపు రెండేళ్ళుగా నా నుంచి సినిమా రిలీజ్ లేదు. థియేటర్స్ లో ప్రేక్షకులు నన్ను చూడటానికి, నేను నన్ను థియేటర్స్ లో చూసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.
 
-ఆడియన్స్ కి నా ఎనర్జీ ఇష్టం. యాక్సిడెంట్ వలన నా సోల్జర్ కి గాయమైయింది. మళ్ళీ ఫుల్ గా ఫిట్ అయి మునుపటి ఎనర్జీ వచ్చిన తర్వాతే స్క్రీన్ మీద కనిపించాలని భావించాను. అందుకే బ్రేక్ వచ్చింది. ఇప్పుడు డార్లింగ్ తో మళ్ళీ ప్రేక్షకులు ముందుకు రావడం చాలా ఆనందంగా వుంది. 
 
డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది ? 
-స్క్రిప్ట్ చాలా నచ్చింది. నా క్యారెక్టర్ ఇంకా నచ్చింది. ఇది చాలా ఛాలెజింగ్ రోల్. ఇప్పటివరకూ ఇలాంటి రోల్ చేయలేదు. స్ప్లిట్ పర్సనాలిటీ వున్న ఈ పాత్రని పెర్ఫార్మ్ చేయడం చాలా ఛాలెజింగా అనిపించింది. కామెడీ, లవ్ స్టొరీ ఎంటర్ టైనర్ లో ఇలాంటి క్యారెక్టర్ పెట్టడం చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. అశ్విన్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిన అద్భుతమైన స్క్రిప్ట్ డార్లింగ్.   
 
ఎనర్జిటిక్ రోల్స్ చేయడానికే ఇష్టపడతారా ? 
-ఎంటర్ టైనింగ్ గా వుండే రోల్స్ ని పిక్ చేయడానికి ఇష్టపడతాను. ఎంటర్ టైనింగ్ గా వుండే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమాలు చూస్తూనే పెరిగాను.  
 
డార్లింగ్ లో ఫన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎలా వుంటాయి ? 
-డార్లింగ్ ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ వున్న కంప్లీట్ ఎంటర్ టైనర్.   
 
స్ప్లిట్ పర్సనాలిటీ యాక్టింగ్ కోసం హోం వర్క్ చేశారా ? -ఒక సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాననే జోన్ లో అప్రోచ్ అయ్యాను. ఇందుకోసం చాలా హోం వర్క్ చేశాను. స్ప్లిట్ పర్సనాలిటీ వున్నా చాలా సినిమాలు చూశాను. అలాగే చెన్నై నుంచి ఒక యాక్టింగ్ స్పెషిలిటేటర్ కూడా వచ్చారు. 
 
డార్లింగ్ స్క్రిప్ట్ విన్న తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఏమిటి ? 
-కథ విన్న వెంటనే సెట్స్ కి వెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయా. అశ్విన్ అద్భుతమైన నేరేటర్. తను చెప్పినప్పుడే సినిమా ఎంత అద్భుతంగా వుంటుందో అర్ధమైపోయింది. 
 
ప్రియదర్శితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? 
ప్రియదర్శి తో కలిసి వర్క్ చేయడం చాలా బావుంది. మాఇద్దరి మధ్య నడిచే కథ. నా యాక్షన్ కి ఆయన రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. మా కెమిస్ట్రీ అద్భుతంగా వర్క్ అయ్యింది. తను చిల్ పర్శన్. తన కామెడీ టైమింగ్ చాలా నేచురల్ గా వచ్చేస్తుంది, 
 
డైరెక్టర్ అశ్విన్ రామ్ గురించి ?  
-అశ్విన్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. చాలా అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. తను ఈ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం అనిపించింది. తను కథ చెప్పినప్పుడే సినిమాని విజువలైజ్ చేయగలిగాను.
 
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాతల గురించి ? 
వెరీ నైస్ ప్రొడ్యూసర్స్. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. యూనిక్ స్క్రిప్ట్స్ పై నమ్మకం పెడతారు. అలాంటి పాషన్ వున్న నిర్మాతలతో పని చేయడం ఆనందంగా వుంది.
 
వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి ? 
-వివేక్ సాగర్ నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. నా కెరీర్ లో ఫస్ట్ టైం సోలో ట్రాక్ డార్లింగ్ లో దొరికింది. ఈ పాట అద్భుతంగా వచ్చింది. అలాగే ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బీజీఎం కూడా అద్భుతంగా చేశారు.
 
మీకు ఏ జోనర్ చిత్రాలు ఇష్టం?  
-నాకు అన్ని రకాల సబ్జెక్ట్స్ ఇష్టం. ప్రతిసారి కొత్తగా చేయాలనేది నా ప్రయత్నం. 
 
మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా ?  
-డార్లింగ్ లో చేసిన రోల్ నా డ్రీమ్ రోల్. 
 
కొత్తగా చేస్తున్న సినిమాలు ? 
-'స్వయంభూ'తో పాటు మరో రెండు సినిమాలు డిస్కర్షన్ లో వున్నాయి. ప్రస్తుతం డార్లింగ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను.