గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (08:52 IST)

సాయిప‌ల్ల‌వి ఒన్ ఉమెన్ షో గార్గి- రివ్యూ రిపోర్ట్‌

Saipalavi, Gargi
Saipalavi, Gargi
ఈమ‌ధ్య సాయిప‌ల్ల‌విని తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఓన్ చేసుకున్నారు. లేడీ ప‌వ‌ర్‌స్టార్ అంటూ ఆమెకు కితాబిచ్చేశారు. అందుకు ఆమె నాకెందుకు ఇలా ఇచ్చారో తెలీదంటూనే న‌వ్వేస్తుంది. ఇటీవ‌లే రానా ద‌గ్గుబాటితో క‌లిసి విరాట‌ప‌ర్వంలో న‌టించింది. ఇప్పుడు తాజాగా ఈ శుక్ర‌వార‌మే `గార్గి` అనే త‌మిళ సినిమాతో తెలుగులోనూ డ‌బ్‌తో విడుద‌లైంది. డైరెక్టర్ గౌతం రామచంద్రన్ చేసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
Saipalavi, Gargi
Saipalavi, Gargi
క‌థః 
ఓ చిన్న ప‌ట్ట‌ణంలో గార్గి (సాయిప‌ల్ల‌వి) స్కూల్ టీచ‌ర్‌. ఆమె తండ్రి ఆర్‌.ఎస్‌. శివాజీ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌. ఓరోజు గార్గికి తెలిసిన అమ్మాయి రేప్‌కు గుర‌వుతుంది. దానికి బాధ్యుడు శివాజీ అని తెలిసి పోలీసులు అరెస్ట్ చేస్తారు.దీంతో గార్గి కుటుంబ‌మే త‌ల‌కిందుల‌వుతుంది. అంద‌రూ వారిని దోషులుగా చూస్తారు. పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పే గార్గి ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారుతుంది. త‌న తండ్రిని కాపాడేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కానీ ఏ లాయ‌ర్ వాదించ‌డానికి ముందుకు రాడు. చివ‌రికి ఓ అసిస్టెంట్ లాయ‌ర్ కాళీవెంక‌ట్ వ‌స్తాడు. ఇక అక్క‌డ‌నుంచి వాద‌న స‌రిగ్గా సాగ‌దు. ఫైన‌ల్‌గా అమ్మాయిని రేప్ చేసింది ఎవ‌రో తెలుస్తుంది? ఆ త‌ర్వాత ఆమె తండ్రిని కాపాడుకుందా? లేదా? మ‌రేమైనా అడ్డంకులు ఎదుర‌య్యాయా? అనేది సినిమా. 

 
విశ్లేష‌ణః
ఓ అమ్మాయికి రేప్ జ‌రిగితే చేసిన వ్య‌క్తి హోదాను బ‌ట్టి  కాపాడ‌డానికి లాయ‌ర్లు చాలా మందే ముందుకు వ‌స్తారు. చివ‌రికి అమ్మాయినే దోషిగా చూపుతారు. ఇవ‌న్నీ క‌థ‌లు చూసేశాం. అయితే రేప్ చేశాడ‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తికి ఏ లాయ‌ర్ వాదించ‌డానికి ముందుకు రాడ‌నేది ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్ ఇందులో. అయినా క‌థంతా తెలిసిన క‌థే అనిపిస్తుంది. కానీ తీసే విధానంలో ద‌ర్శ‌కుడు కొత్త‌గా ఆవిష్క‌రించాడు.
 
Saipalavi, Gargi
Saipalavi, Gargi
సాయిప‌ల్ల‌వి మిన‌హా పెద్ద‌గా తెలుగువారికి ప‌రిచ‌యంలేని న‌టీన‌టులే ఇందులో న‌టించారు. క‌థ ప్రారంభ‌మైన పది నిమిషాల్లోనే కథలోకి లాక్కేలుతాడు డైరెక్టర్ గౌతం రామచంద్రన్. ఇది కథా బలం ఉన్న సినిమా, చాలా ఆసక్తి దాయకంగా ఉంటుంది సినిమా, ఆస‌క్తిక‌రమైన స్క్రీన్ ప్లేతో ర‌క్తిక‌ట్టించాడు. క‌థ నిడివి త‌క్కువే అయినా ఎక్క‌డా బోర్ లేకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. ఫ్యామిలీ స్టోరీ థ్రిల్లర్  సినిమా చూస్తున్నాం అనె ఫీల్ కలుగుతుంది కలుగుతుంది. దానితోపాటు డ్రామా ఎక్క‌ువ‌యింది అని కూడా అనిపిస్తుంది.
 
ఒక సన్నివేశంలో సాయిపల్లవి ఎక్కి ఎక్కి ఏడ్చే సీనులో అద్భుతంగా నటించింది. ఇలాంటి మరచిపోలేని నటనే గతంలో ఏడడుగులు బంధంలో జయసుధ చేసింది, (భర్తతో విడాకులు తీసుకున్నాక డైనింగ్ టేబుల్ వద్ద అన్నం తింటూ తన అమ్మానాన్నను ఉద్దేశించి ఇక మీకు సంతోషమే కదా విడాకులు ఇప్పించారు, విడతీసారు. ఇప్పుడు మీకు హాయిగా ఉందా అంటూ ఏడుస్తూ అన్నం చేత్తో కలుపుతూ పెద్దపెద్ద ముద్దలు తినే సీన్లో సహజనటి నటన అద్భుతః). అలాగే ఆడదేఆధారం చిత్రంలో నటి సీత జీవించింది. (తను ఏడుస్తూ తనవాళ్లు ఆ ఏడుపు చూడొద్దు అని వాళ్లు చూస్తున్నప్పుడు నవ్వుతూ...ఇలా వెంటవెంటనే హావభావాలు ప‌లికించింది)

 
ఇక ఈ క‌థ‌లో క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌.. సినిమా తీయ‌డానికి కారుణ‌మైంది. ఈ సినిమాను అంద‌రూ చూడాల్సిన సినిమా. ముఖ్యంగా యూత్‌, పిల్ల‌ల్ని ఎలా పెంచాలో త‌ల్లిదండ్రులు చూడాలి. జ‌వాబుదారిత‌నాన్ని నేర్పాలి.

- ఇక టెక్నిక‌ల్‌గా అంద‌రూ బాగానే చేశారు. క‌థ డామినేట్‌లో దానిలో లీన‌మైపోతారు ప్రేక్ష‌కులు.
రేటింగ్- 3/5