సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (06:29 IST)

రంగస్థలం, సినియా గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఉత్సవం చేశారు : బ్రహ్మానందం

Brahmanandam, LB sriram and others
Brahmanandam, LB sriram and others
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అతిధులుగా హాజరైన ఈ టీజర్ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది.
 
'కళాకారుడు చనిపోవచ్చుగానీ కళ చనిపోకూడదు' అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనుభూతిని ఇచ్చింది. టీజర్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, అలీ, ప్రేమ, ఆమని, ప్రియదర్శి లాంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో కనిపించడం కన్నులపండగలా వుంది. యంగ్ హీరో దిలీప్ ప్రకాష్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా వుంది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా పాత్రలని ప్రజెంట్ చేసిన తీరు చాలా ఆసక్తిరకంగా వుంది. దర్శకుడు అర్జున్ సాయి ఇంతమంది వెర్సటైల్ యాక్టర్స్, వారి పాత్రల్లోని ఎమోషన్ ని టీజర్ లో అద్భుతంగా చూపించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మనసుని హత్తుకునేలా వుంది. రసూల్ ఎల్లోర్ వండర్ ఫుల్ విజువల్స్ అందించారు. ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి టీజర్ 'ఉత్సవం'పై చాలా ఆసక్తిని పెంచింది.
 
బ్రహ్మానందం మాట్లాడుతూ.. నటులు, నట జీవితం అంటే నాకు ఒక ఎమోషనల్ ఎటాచ్మెంట్. ఆర్ట్ ఈజ్ లాంగ్.. లైఫ్ ఈజ్ షార్ట్. చివరి వరకూ మిగిలిపోయేది కళ మాత్రమే. కళా కారులందరినీ ఒక్క చోటికి చేర్చి వీరిపై ఒక సినిమా చేయాలని ఆలోచన చేసిన దర్శకుడు అర్జున్ సాయికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే ధైర్యంతో పాటు సినిమాటిక్ గా చెప్పే నేర్పు కావాలి. ఇంతమంది నటీనటులని ఒక్క చోటికి చేర్చి చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు. నిజంగా ఈ సినిమా 'ఉత్సవం'లా వుంటుంది. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. విభిన్నమైన కథలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కళకు ఆయువుపట్టు నాటకరంగం. తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హీరో దిలీప్ చక్కని నటన కనపరిచాడు. రంగస్థలం గురించి, ఈ సినియా గురించి దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని 'ఉత్సవం' తీర్చిదిద్దారు. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది'' అన్నారు.  
 
హీరో దిలీప్ మాట్లాడుతూ.. కలర్ పుల్, ఎమోషనల్ జర్నీ, కంటెంట్ బేస్డ్ 'ఉత్సవం' సినిమాతో  పరిచయం కావడం గర్వంగా, గౌరవంగా వుంది. నన్ను నమ్మి ప్రోత్సహించిన నిర్మాతకు కృతజ్ఞతలు. మా సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు ఆశీస్సులు, ఆదరణ మా సినిమా కావాలి'' అని కోరారు.  
 
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. సినిమాకి మూలమే నాటకరంగం. ఈ  టీజర్ లోని మొదటి డైలాగే చాలా ఆకట్టుకునేలా వుంది. ఇంతమంది లెజెండరీ నటులతో ఈ చిత్రాన్ని రూపొందించడం చాలా విశేషం. ఇంత మంచి కళాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన అర్జున్ సాయి కి అభినందనలు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు
 
దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ..  గత పదేళ్ళుగా పరిశ్రమలో సహాయ దర్శకుడిగా, రచయితగా పని చేశాను. దర్శకుడిగా ఇది ఉత్సవం నా తొలి చిత్రం. టీజర్ లాంచ్ చేసిన  బ్రహ్మానందం గారు,  నిర్మాత ఏఎం రత్నం గారికి కృతజ్ఞతలు'' తెలిపారు.
 
ప్రముఖ నటుడు ఎల్. బీ శ్రీరామ్ మాటాడుతూ..  నాటకానికి సంబంధించి ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్సవం వస్తోంది. సినిమా చాలా బావుంటుంది. నాటకం అమ్మలాంటింది. నాటకం నుంచి పుట్టిన అనేక రూపాలే నేటి కళారూపాలు. తల్లిని గౌరవించినపుడే మనికి 'ఉత్సవం'' అన్నారు
 
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఉత్సవం హార్ట్ టచ్చింగ్ సబ్జెక్ట్. చాలా పెద్ద నటీనటులు ఇందులో వున్నారు. అర్జున్ చాలా అద్భుతంగా సినిమాని తీశారు. ఇందులో చాలా పాటలు వున్నాయి. నేను చేసిన సినిమాల్లో ఉత్సవం కూడా మంచి ఆల్బమ్స్ అవుతుందని నమ్ముతున్నాను'' అన్నారు. అనంతశ్రీరాం, లక్ష్మీ భూపాలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
 
తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ