1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (15:23 IST)

నాలుగు కథలు తో రూపొందిన మూడోకన్ను విడుదల సిద్ధం

Madhavilatha,  Srikanth, veerashankar and others
Madhavilatha, Srikanth, veerashankar and others
అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఆంథాలజీ చిత్రం మూడోకన్ను. ఈ  చిత్రానికి సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య,  కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు నలుగురు కొత్త దర్శకులుగా పరిచయం అవుతున్నారు. నాలుగు కథలు, నలుగురు దర్శకులు రూపొందించారు. కాగా, హీరో శ్రీకాంత్ మూడో కన్ను మూవీ  ట్రైలర్ ఆవిష్కరించారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్ మహి నాకు బాగా తెలిసినవాడు. కథని నమ్మి సునీత రాజేందర్, కె.వి రాజమహి నిర్మాతగా వచ్చారు .ఈ సినిమా మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది.  చిన్న సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఈ ట్రైలర్ చాల బాగుంది ఇప్పుడే చూశాను , ఈ టీంకి పనిచేసిన వాళ్లందరికీ మరియు నలుగురు డైరెక్టర్స్ కి అల్ ది బెస్ట్ చెప్పారు.
 
దర్శకుడు, నటుడు వీరశంకర్ మాట్లాడుతూ, రాజమహి ఒక దర్శకుడు అయి ఉండి  తాను కొత్తగా నలుగురు డైరెక్టర్స్ పరిచయం చేయటం గొప్ప విషయం  తాను రాసె కథలు ఒక రియల్ ఇన్సిడెంట్ ద్వారా ఉంటాయి . మంచి మెసేజ్ తో కూడిన కథలతో ఉంటాయి , ఈ సినిమాలో నేను కూడా నటించాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది నమ్మకం ఉంది అన్నారు. 
 
మాధవిలత, మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశాను ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ కి థాంక్స్ చెప్పనుకుంటున్నాను.
 
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన సూర్య, మహేష్ వడ్డి, నిరోష,  కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, మాధవి లత, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య,  వీర శంకర్, రూప, ఇంకా పలుగురు  మాట్లాడుతూ ఈ చిత్రం అందరూ చూడదగిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్  అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతున్న కొత్త కాన్సెప్ట్ అని, కొత్త టాలెంట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని  కోరుకున్నారు.
 
అలాగే ఈ చిత్ర నిర్మాతలైన కె.వి రాజమహి మరియు  సునీత రాజేందర్ లు మాట్లాడుతూ, డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని వేడుకున్నారు. ఈ చిత్రానికి కథ కథనం మాటలు కె.వి రాజమహికి  ఇప్పటికే టీజర్ రిలీజ్ అయి మంచి ప్రేక్షాదరణ పొందిది  ఈ చిత్రం జనవరి 26న  లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాము అన్నారు.