ఆస్పత్రిలో హడావడి శృశానంలోని సైలెన్స్- ట్రెండింగ్‌లో బిగినింగ్ ట్రైలర్
దేరీజ్ నో గ్యారెంటీ ఫర్ బర్త్ బట్, దేరీజ్ ఏ గ్యారెంటీ ఫర్ డెత్.
'ఎవడి పుట్టుకా ఎవ్వడికీ తెలీదు. కాని, పుట్టాక చావు ఖాయం' అంటూ తాత్విక క్యాష్షన్‌తో 'బిగినింగ్' ట్రైలర్‌పై ఆసక్తి రేంత్తించారు. గాఢత కలిగిన కథలను సెల్యూలాయిడ్‌పై చూపించేందుకు టాలీవుడ్ ట్రెండీ డైరెక్టర్లు కొత్త కొత్త ప్రయోగాలకు పదును పెడుతూనే ఉన్నారు. సున్నితమైన అంశాన్ని సిల్వర్ ప్ర్కీన్‌పై సుతిమెత్తగా చూపించే కథలను ఆడియన్సూ ఆదరిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో - 'బిగినింగ్' ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు ముదునూరు రాజ్ ఓ ప్రామిసింగ్ స్టోరీ ఆడియన్స్ ముందుకు తెస్తున్నట్టే కనిపిస్తోంది.
మనిషి జీవితానికి ఆది అంతం, చావు పుటకలే. ఈ రెండింటి ప్రాధాన్యతను ప్రకృతి నేపథ్యంగా చెప్పనున్న కథే - 'బిగినింగ్'. ముదునూరు రాజ్ దర్శకుడిగా, జోషిరామ్, సృష్టి జైన్ జోడీగా డిఎన్‌ఏ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న చిత్రమిది. చేతన్ శర్మ ప్రమోద్ కుమూర్, ఆయుషి రావత్, ఆర్యన్ ప్రీత్‌లాంటి కొత్త కాస్టింగ్‌తో రూపొందిన సినిమా అఫీషియల్ టైలర్ సోమవారం విడుదలైంది. హర్షితా ఎంటర్‌టైన్‌మెంట్స్, గుడివాడ స్టూడియోస్ భాగస్వామ్య నిర్మాతలు.
ట్రైలర్‌లో, 'మీ అమ్మానాన్నలను తలచుకుంటేనే భయమేస్తుంది' అన్న డైలాగ్‌తో -హీరో లైఫ్‌లోని 'స్ట్రగుల్' పాయింట్, దానిలోని ఎమోషనల్ బీట్‌ను డైరెక్టర్ రాజ్ ఏ రేంజ్‌లో చెప్పనున్నాడో అర్ధమవుతుంది. లైఫ్ అండ్ డెత్ కంటెంట్‌ను స్ట్రాంగ్ సెంటిమెంట్‌తో చెబుతూనే 'నువ్వు బీటెక్- తను మెడికో' అన్న సింగిల్ లైన్ డైలాగ్‌తో ప్రామిసింగ్ 'లవ్ స్టోరీ' చూపించనున్నారన్న క్యూరియాసిటీ తెరకెత్తించారు. 'పవన్ కల్యాణ్‌ను తెస్తాన'ని కూతురికి ప్రామిస్ చేసి రోడ్డెక్కిన అమాయక తండ్రి పాత్ర. టాలీవుడ్‌కి కొత్తతరహా కామెడీని రుచి చూపించేదే కావొచ్చు. ఒక్క పాత్రనూ స్కీన్ మీద స్ట్రయిట్‌గా చూపించకుండా పాత్రధారులు ఎలా ఉండబోతున్నారోనన్న అసక్తిని రేకెత్తించాడు దర్శకుడు. ఆస్పత్రిలో హడావడిని.. శృశానంలోని సైలెన్స్‌తో కంపేర్ చేసి చెప్పిన డైలాగ్ -సినిమా కంటెంట్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో చెప్పకనే చెబుతుంది. 'జయ జయ హనుమా... జగతికి జనకా'.. అంటూ సాగే బీజింగ్ 'బిగినింగ్'కు మరో హైలైట్.
ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే - కొన్నేళ్ల క్రితం '3జి లవ్' టైటిల్‌తో థర్డ్ జనరేషన్ సినిమా చేశాడు. ఆ కథ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంతో, కొంతకాలం అలాంటి కథలనే టాలీవుడ్ గుడ్డిగా ఫాలో
అయిపోయింది. కొంత గ్యాప్ తరువాత పరిపక్వత కలిగిన 'బిగినింగ్' స్టోరీతో వస్తున్నాడు ముదునూరు రాజ్. టైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు రాజ్ మాట్లాడుతూ "నేచర్ నేపథ్యంగా సాగే కథ కోసం చాలా కష్టపడ్డాం. ఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబం కథ చెప్పడం కోసం... హిమాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని నేచర్‌కి దగ్గరగా వెళ్లాం. మేం చూపించే నేచర్‌తో టాలీవుడ్‌కు సరికొత్త లొకేషన్లు రుచి చూపించబోతున్నట్టే. కథలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యముంది. వాటిపై ఆసక్తి పెంచేందుకే -టైలర్‌లో పాత్రలను చూపించకుండా సీక్రెసీ మెయిన్‌టెన్ చేశా. సినిమా దాదాపుగా పూర్తెంది. త్వరలోనే విడదలకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నాడు. త్వరలో పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నాయి.
జర్మనీలో సెటిలైన కవిశంకర్ సంగీతం సమకూర్చిన చిత్రానికి ఢిల్లీ బేస్‌డ్ కెమెరామెన్ నౌషద్ అలీ పనితనం 'బిగినింగ్'కు మరింత హైలెట్ కావడం ఖాయం. పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు -ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), పోస్ట్ ప్రొడక్షన్స ప్రసాద్ ల్యాబ్స్, ఎస్‌ఎఫ్‌ఎక్స్: సురేష్ (ధ్వని స్టూడియోస్), వీఎఫ్‌ఎక్స్: మంత్రిక్స్ స్టూడియోస్, లిరిక్స్: చైతన్యప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: షబ్నం మహ్మద్ హసిం, డిజైనర్: మదన్. నిర్మాణ సంస్థ డిఎన్‌ఏ ప్రొడక్షన్స్. భాగస్వామ్య నిర్మాత సంస్థలు: హర్షితా ఎంటర్‌టైన్‌మెంట్స్, గుడివాడ స్టూడియోస్. దర్శకుడు: ముదునూరు రాజ్.