గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 జులై 2024 (20:11 IST)

చియాన్ విక్రమ్ తంగలాన్ మరో కె.జి.ఎఫ్. అవుతుందా !

Chiyan Vikram
Chiyan Vikram
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తంగలాన్" ట్రైలర్ రిలీజ్ చేశారు.
 
"తంగలాన్" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - బ్రిటీష్ పాలనా కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం కోసం వేట మొదలుపెడతారు బ్రిటీష్ అధికారులు. స్థానిక తెగల వారిని బంగారం వెలికి తీసేందుకు పనిలో పెట్టుకుంటారు. ఒక తెగ నాయకుడిగా విక్రమ్ ను చూపించారు. ఈ బంగారం వేటలో రెండు తెగల మధ్య పోరు మొదలవుతుంది. తన వారిని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయని నాయకుడిగా విక్రమ్ చూపించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్ ఈ పాత్ర కోసం మారిపోయిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తోంది. ట్రైలర్ లో విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి. విక్రమ్ బ్లాక్ పాంథర్ తో చేసిన ఫైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చరిత్రలోని వాస్తవ ఘట్టాలను దర్శకుడు పా రంజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు "తంగలాన్" ట్రైలర్ తో తెలుస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు త్వరలోనే "తంగలాన్" సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
 
నటీనటులు - చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు