శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (07:17 IST)

చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్ తో 62వ చిత్రం వీర ధీర శూరన్

Veera Dheera Sooran maas avatar
Veera Dheera Sooran maas avatar
జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. చియాన్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
 
‘వీర ధీర శూరన్’లో ప‌క్కా మాస్ అవ‌తార్‌లో చియాన్ విక్ర‌మ్ అభిమానుల‌ను మెప్పించ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో పేరు కాళి. త‌న‌కు ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో త‌ను ప‌ని చేసుకుంటుంటాడు. అత‌నితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న హీరో అని క‌న్‌ఫ‌ర్మ్ అయితే అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌.. అయితే విల‌న్స్ జాడ‌ను హీరో ప‌సిగ‌ట్టేస్తాడు. అక్క‌డ ప‌ని చేసుకుంటూనే విల‌న్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. త‌మ‌ను కొట్టింది హీరో అని తెలియ‌గానే విల‌న్స్ క‌త్తులు తీసుకుని దాడి చేయ‌టానికి వస్తుంటారు. అంతే.. మ‌న క‌థానాయ‌కుడు అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విల‌న్ చెవికి గాయ‌మ‌య్యేట‌ట్లు కాల్చ‌డంలో దుండ‌గులు భ‌యంతో ప‌రుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ హీరో చేతిలోని గ‌న్ చూసి భ‌య‌ప‌డుతుంది. కానీ హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్ప‌టంతో షాపులోని లేడీ క‌స్ట‌మ‌ర్‌, ఓ ప‌క్క భ‌యం, మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంతో నోరు వెల్ల‌బెట్టేస్తుంది.
 
 225 సెక‌న్ల పాటుండే  ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజ‌ర్‌లోనే అంత మాస్ ఎలిమెంట్స్ఉన్న‌ప్పుడు సినిమాలో ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్ కెవ్వు కేక అనిపించ‌టం ప‌క్కా అని తెలుస్తుంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.