బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 21 జనవరి 2022 (16:26 IST)

హలో బ్రో.. అంటూ సీఎం జగన్‌ను తీవ్రంగా విమర్శించిన యువతి, ఎవరు?

నిన్న ఉపాధ్యాయుల ఆందోళన ఏ స్థాయిలో జరిగిందో చెప్పనవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలు అట్టుడికాయి. ఒక్కసారిగా కలెక్టరేట్ కార్యాలయాలు స్తంభించిపోయాయి. ఉపాధ్యాయులు వినూత్నంగా నిరసనలు తెలుపుతూ పీఆర్సీను వ్యతిరేకించారు. అయితే దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు.

 
కానీ యుఎస్‌లో ఉన్న ఒక యువతి మాత్రం తనదైన శైలిలో సిఎం జగన్ రెడ్డిపై స్పందించింది. అసలు ఆమె ఏమందో ఆమె మాటల్లోనే.. హలోబ్రో.. అమరావతి రైతులను 750 డేస్ నుంచి వాళ్ళ పిల్లలతో సహా రోడ్లో నుంచే బెట్టి వాళ్ళని కొట్టించి, హింసించి, తిండి, నిద్రా లేకుండా చేసి రకరకాల హింసలు పెట్టావు బ్రో.. నువ్వు గ్రేట్ బ్రో..

 
అండ్ నువ్వు అన్ని వర్గాల వారిని కవర్ చేస్తున్న విధానం అయితే నెక్ట్స్ లెవల్ బ్రో. విద్యార్థులు, రైతులు, అమ్మలు, నాన్నలు, అక్కలు, చెల్లెల్లు, అవ్వలు, తాతలు, వికలాంగులు, దళితులు అందరినీ భలే కవర్ చేశాయి. అండ్ నౌ టీచర్స్..అంటే వాళ్ళు మనకి చిన్నప్పుడు మంచి అంటే ఏమిటి..చెడు అంటే ఏమిటి..అని సుమతి శతకాలు, వేమన పద్యాలు చెప్పి మనల్ని మంచి మార్గంలో నడిచేలా చేసి ఎంతోమందిని ఉన్నత శిఖరాలవైపు తీర్చిదిద్దారు.

 
వాళ్ళకి నువ్వు రుణం తీర్చుకోవడానికి, గురుదక్షిణగా పోలీస్టేషన్లో పడేసి.. వాళ్లని కొట్టించి హింసిస్తున్నావు చూడు నువ్వు నీకే సాటి బ్రో.. అంటే ఆ రోజు నువ్వు అక్క చెల్లెలు, అవ్వ తాతలు అని అలా ముద్దు ముద్దుగా పిలిచి ఈ రోజు నువ్వు ఆ అక్కచెల్లెలు, అవ్వతాతల బతుకులతో అష్టాచెమ్మా ఆడుతున్నావే.. హ్యాట్సాప్ టు యు బ్రో. నీ పరిపాలన చేసి నాకు బ్రిటీషర్స్ గుర్తుకు వస్తున్నారు.

 
అంటే నువ్వు బ్రిటీషర్స్‌ని మించి పోయావు బ్రో. బ్రిటీష్ వారు కూడా నీ అంత కర్కశంగా, కసిగా హింసించడమనేది చేయలేదు బ్రో.. నువ్వు తోపు బ్రో. మన పరిపాలన చూసి చాలా కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోతున్నాయ్ అంటూ సిఎంను ఉద్దేశించి ఆమె ఫార్వర్డ్ చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఇంతకీ ఈ యువతి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసిపి నాయకులు.