ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:50 IST)

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల ప్రకారం... నో మాస్క్- నో పెట్రోల్...

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రాబర్ట్ సన్ పేట పోలీసులు నూతన  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బందరు పట్టణంలో రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు యజమానులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి, అలాగే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాహనదారులకు మాస్క్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సోమవారం నుండి మాస్క్ లేకపోతే  పెట్రోల్, డీజిల్ కొట్టరని, అలాగే అపరాధ రుసుము కూడా విధిస్తారని తెలియజేసారు. ఇలాంటి కఠినమైన నిబంధన విధించినా ప్రజలు మాస్కులు వేసుకుంటారో లేదంటా అపరాధ రుసుము కడుతూ వుంటారో?