కమలనాథులపై శివసేన ఆగ్రహం... విర్రవీగితే.. వాత పెడతారు!

shiv sena
ఠాగూర్|
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దరిమిలా బీజేపీపై మిత్రపక్షం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. అధికారంలో ఉన్న నాయకులు అహంకారంతో వ్యవహరించినందుకు ప్రజలు కీలెరిగి వాత పెట్టారంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికల ముందు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో చేపట్టిన మహా జనదేశ్ యాత్ర ప్రభావమేదీ లేదని తేల్చింది. ఈ ఎన్నికల్లో కూటమికి 200కు పైగా స్థానాలు వస్తాయన్న ఫడ్నవీస్ అంచనాలు తలకిందులయ్యాయని పేర్కొంది.

ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో బీజేపీపై విమర్శలు గుప్పించింది. విపక్షాల్లో చీలికలతో ఎన్నికల్లో గెలువలేరని స్పష్టమైందని పేర్కొంది. ఎన్నికల ముందు శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీని బీజేపీ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని తెలిపింది.

అయితే, 50 సీట్లకు పైగా గెలుచుకుని ఎన్సీపీ తమ బలం పెరిగిందని నిరూపించుకుందని, సరైన నాయకత్వంలేని కాంగ్రెస్ సైతం 44 స్థానాలు గెలుచుకుని తన సత్తా చూపిందన్నది. పార్టీల ఫిరాయింపులు, విపక్షాల్లో చీలికలతో ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీజేపీ భావించింది.దీనిపై మరింత చదవండి :