బామ్మ ఇడ్లీ షాపుపై మనసుపడిన ఆనంద్ మహీంద్రా.. (video)

coimbattur bhamma
Last Updated: బుధవారం, 11 సెప్టెంబరు 2019 (16:30 IST)
ఆనంద్ మహీంద్రా.. దేశంలో ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరు. మహీంద్రా గ్రూపు అధినేత. అయితే, ఈయన సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉంటుంటారు. ఆసక్తికరమైన అంశాలపై ఆయన స్పందిస్తుంటారు.

తాజాగా కోయంబత్తూరులో నిస్వార్థంగా ఒక్క రూపాయికే ఇడ్లీలు అమ్ముతూ పేదోడి ఆకలి తీరుస్తూ సేవలు అందిస్తున్న బామ్మ కమలాథల్. ఈమె నడుపుతున్న ఇడ్లీ షాపు గురించిన వార్త ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆనంద్ మహీంద్రా కంటపడింది.

అంతే.... ఆయన బామ్మ కమలాథల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఇలాంటి కథనాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మనం జీవితంలో చేసే అన్నిపనులు కమలాథల్ చేస్తున్న సేవలో కొంత భాగానికి అయినా సరితూగుతాయా? అని అనిపిస్తోంది.

కమలాథల్ ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నట్లు నేను వీడియోలో గమనించా. ప్రజలెవరైనా ఆమె వివరాలు కనుక్కొని నాకు చెబితే కమలాథల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఓ ఎల్పీజీ స్టౌవ్‌ను కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా' అని ప్రకటించారు. దీంతో పలువురు నెటిజన్లు ఆమె వివరాలను ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్‌లో పంపారు.

దీనిపై మరింత చదవండి :