మద్యం ప్రియులకు శుభవార్త : ఇతర రాష్ట్రాల నుంచి 3 బాటిళ్లు తెచ్చుకోవచ్చు...

liquor bottles
ఠాగూర్| Last Updated: బుధవారం, 2 సెప్టెంబరు 2020 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యంబాబులకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఓ శుభవార్త చెప్పింది. ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చంటూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ బుధవారం కీలక తీర్పునిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీచేసిన జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని హైకోర్టు కలిగించింది. హైకోర్టు తీర్పుతో మద్యం ప్రియులకు ఏపీలో ఉన్న పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగినట్లు అయ్యింది.దీనిపై మరింత చదవండి :