1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (19:53 IST)

సరయూ నది వద్ద ఈ డ్యాన్సులేంటి తల్లీ..!

Sarayu
Sarayu
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ్‌కీ పైడి ఘాట్‌లోని సరయూ నది వద్ద ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో క్లిప్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పింక్ సల్వార్ సూట్‌లో ఉన్న మహిళ, 'జీవన్ మే జానే జానా' అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ నీటిలో చిందులు వేస్తూ హెయిర్ ఫ్లిప్ చేస్తూ కనిపిస్తుంది.
 
సరయూ లాంటి పవిత్రమైన నది వద్ద ఇలాంటి డ్యాన్సులు ఏంటి అంటూ పెద్ద సంఖ్యలో యాత్రికులు ఈ వీడియోపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా ప్రార్థనా స్థలాన్ని అగౌరవపరిచినందుకు మహిళపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అయోధ్య పోలీసులు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.