మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: బుధవారం, 14 నవంబరు 2018 (11:15 IST)

ఎన్టీఆర్ గారి అబ్బాయి బాలకృష్ణ గారు నోరు అదుపులోపెట్టుకోవాలి: ప‌వ‌న్ కల్యాణ్

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ… టీడీపీ నేత‌లపై ఫైర్ అయ్యారు. జనసేన ఆడపడుచులు, యువతీయువకుల పట్ల టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లు నా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి అని అన్నారు. పెద్దలు, ఎన్టీఆర్ గారి అబ్బాయి బాలకృష్ణ గారు మన జనసేన కార్యకర్తలని అలగా జనం అంటూ కామెంట్ చేసారు. 
 
అలాగే ప్రజల పట్ల తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారు. ఈ మధ్యనే అచ్చెన్నాయుడు మత్స్యకారులను ఇలాగే తిట్టారు. వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. కాకినాడ సభ నుంచి చెబుతున్నా, కాకినాడ పార్లమెంట్ సీటు, ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు జనసేనకు దక్కాలి. ఆ విధంగా జన సైనికులు ముందుకు వెళ్ళాలి అన్నారు.