బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (22:34 IST)

కుక్క అనుకుని నక్కను పెంచారు, అర్థరాత్రి ఊళ వేయడంతో ఉలిక్కిపడ్డారు (video)

Fox
చాలామందికి బుజ్జి కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. అవి రోడ్ల పైన బుజ్జిబుజ్జి అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే వాటిని కొంతమంది పెంచుకునేందుకు తీసుకుని వెళ్తుంటారు. అలాగే బెంగళూరులోని కెంగేరిలో వుంటున్న ఓ కుటుంబంలోని సభ్యులకు వాళ్లు వెళ్తున్న దారిలో కుక్కపిల్ల కనిపించేసరికి దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి దానికి కావలసినవన్నీ తినిపించడం చేస్తూ వచ్చారు.

 
ఆ కుక్కపిల్ల పెద్దదవుతూ వుండగా... కుక్కలా మొరగటం కాకుండా వింతవింత శబ్దాలు చేస్తోంది. కొందరు... దాని అరుపులు విని... ఏంటి నక్కను పెంచుతున్నారనేసరికి వారు ఒకింత అవాక్కయ్యారు.

 
అంతేకాదు.. రాత్రిపూట కుక్కలా కాకుండా నక్కలా ఊళ వేస్తుండటంతో... తాము తెచ్చింది కుక్కపిల్ల కాదు... నక్కపిల్ల అని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ప్రాణిదయా ప్రతనిధులకు చెప్పడంతో వారు ఆ నక్కను నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో వదిలేసారు.